TamilNadu: గుళ్లలో చోరీలు చేస్తున్నారంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు.. కుటుంబంపై గ్రామస్థుల దాడి.. బాలిక మృతి

గుళ్లలో చోరీలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ కుటుంబం వెంటపడి గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఓ పదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడులోని పుదుకొట్టయీలో చోటు చేసుకుంది. ఆ కుటుంబం వెంటపడి తరుముతూ గ్రామస్థులు భీకరదాడి చేయడం కలకలం రేపుతోంది.

TamilNadu: గుళ్లలో చోరీలు చేస్తున్నారంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు.. కుటుంబంపై గ్రామస్థుల దాడి.. బాలిక మృతి

Tamil Nadu temples: గుళ్లలో చోరీలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ కుటుంబం వెంటపడి గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఓ పదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడులోని పుదుకొట్టయీలో చోటు చేసుకుంది. ఆ కుటుంబం వెంటపడి తరుముతూ గ్రామస్థులు భీకరదాడి చేయడం కలకలం రేపుతోంది. కిల్లానూర్ గ్రామంలోని గుళ్లలో ఓ కుటుంబం చోరీలు చేస్తోందంటూ ఇటీవల వాట్సాప్ లో మెసేజ్ లు వ్యాపించాయి.

ఓ కుటుంబంలోని ఆరుగురు ఆటోలో వెళ్తున్న సమయంలో గమనించిన గ్రామస్థులు ఆ వాహనాన్ని వెంబడించారు. గుళ్లలో చోరీలకు పాల్పడుతోంది వారేనని ఆరోపించారు. మచువాడీ ప్రాంతంలో ఆ కుటుంబాన్ని పట్టుకుని దాడి చేశారు. పోలీసులు ఈ సమాచారం అందుకుని, అక్కడకు చేరుకుని గ్రామస్థులను అడ్డుకున్నారు.

అప్పటికే తీవ్రగాయాలు కావడంతో ఆ కుటుంబంలోని పదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. తాము గుళ్లను దర్శించుకుంటున్న క్రమంలో తమ కుటుంబంపై దాడి జరిగిందని బాధిత కుటుంబంలోని మహిళ లిల్లీ పుష్ప పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..