మూఢ నమ్మకాలతో గుడ్లగూబను బలిచ్చే 11 మంది ముఠా అరెస్ట్

  • Published By: madhu ,Published On : July 3, 2020 / 08:59 AM IST
మూఢ నమ్మకాలతో గుడ్లగూబను బలిచ్చే 11 మంది ముఠా అరెస్ట్

సంపద రావాలని, ఆరోగ్యంగా ఉండాలని కొంతమంది జంతువులను బలి ఇస్తుంటారనే సంగతి తెలిసిందే. బలి ఇవ్వడం వల్ల అంతా మేలు జరుగుతుందని నమ్ముతుంటారు. ఇలాగే..కొంతమంది గుడ్లగూబను బలి ఇచ్చేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న అధికారులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. పంచమహల్స్, మహిసాగర్, సబర్కాంత జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఈ ఘటన వడోదరలో చోటు చేసుకుంది.

వీరి నుంచి గుడ్లగూబ, తాబేళ్లు, ఓ ముళ్ల పందిలను రక్షించారు. వీరిని అధికారికంగా అరెస్టును ప్రకటించలేదని తెలుస్తోంది. వీరికి కోవిడ్ -19 పరీక్షల తర్వాత…రిమాండ్ కోరుతామని వడోదర ఫారెస్టు డిప్యూటి కన్వర్జేటర్ WL వాఘేలా వెల్లడించారు. వారి ఫోన్లను పరిశీలించగా..జంతువులను పట్టుకొనే వీడియోలు ఉన్నాయన్నారు. కానీ బలి ఇచ్చేందుకు చేశారా ? అనేది తెలియాల్సి ఉందన్నారు.

తమకు వచ్చిన సమాచారం మేరకు…వీరిని పట్టుకొనేందుకు వ్యూహాలు రచించామన్నారు. 22 మంది పోలీసు టీంను ఏర్పాటు చేసి పంచమహల్స్ లో మొదటి నిందితుడిని పట్టుకోవడం జరిగిందన్నారు. ఇతని విచారించగా…అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. కలోల్ నుంచి పోలీసు టీం బయలుదేరి…కదనా తాలూకాలో దీనితో సంబంధం ఉన్న ఇద్దరిని, ఇలా..ఈ ఘటనతో సంబంధం ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

తాము రక్షించిన మూడు జంతువులు మినహా ఇతర జంతువులు కనిపించలేదని, ప్రాథమిక విచారణలో అటవీ ప్రాంతాల నుంచి జంతువులను పట్టుకున్నారని తేలిందన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యం..లాక్ డౌన్ తర్వాత..చాలా మందికి ఉపాధి పోయిందని తెలిపారు. ఈ రాకెట్ లో ఇంకా ఎవరైనా ఉన్నారా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read:రౌడీ షీటర్‌ను పట్టుకోవడానికి వెళ్లి.. కాల్పుల్లో 8మంది పోలీసులు మృతి