Tamil Nadu : తమిళనాడులో ఆలయ రథోత్సవంలో విషాదం.. విద్యుత్ షాక్ తో 11 మంది భక్తులు మృతి

ప్రతి ఏటా నిర్వహించే రథోత్సవంలో భాగంగా ఈసారి కూడా వేడుకలు నిర్వహించారు. భారీగా భక్తులు హాజరయ్యారు. ఉత్సాహంగా రథాన్ని లాగుతున్న సమయంలో రథం పైభాగం హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తాకింది.

Tamil Nadu : తమిళనాడులో ఆలయ రథోత్సవంలో విషాదం.. విద్యుత్ షాక్ తో 11 మంది భక్తులు మృతి

Tamil Nadu

Updated On : April 27, 2022 / 7:37 AM IST

Tamil Nadu electric shock : తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. తంజావూరు జిల్లాలోని కలిమేడు ఆలయ రథోత్సవంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తో 11 మంది భక్తులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ప్రతి ఏటా నిర్వహించే రథోత్సవంలో భాగంగా ఈసారి కూడా వేడుకలు నిర్వహించారు. భారీగా భక్తులు హాజరయ్యారు. ఉత్సాహంగా రథాన్ని లాగుతున్న సమయంలో రథం పైభాగం హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తాకింది.

Tragedy : విద్యుత్ షాక్ తో తండ్రీకొడుకులు మృతి

ఒక్కసారిగా భక్తులకు కరెంట్ షాక్ తగిలింది. దీంతో 11 మంది భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.