Gujarat Cable Bridge Collapse : గుజరాత్‌ కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదం.. బీజేపీ ఎంపీ కుటుంబానికి చెందిన 12 మంది మృతి

గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో జరిగిన కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదం రాజ్‌కోట్‌ బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్‌ కళ్యాణ్‌జీ కుందరియా ఇంట్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఎంపీ మోహన్‌భాయ్‌ కళ్యాణ్‌జీ కుందరియా కుటుంబానికి చెందిన 12 మంది మృతి చెందారు.

Gujarat Cable Bridge Collapse : గుజరాత్‌ కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదం.. బీజేపీ ఎంపీ కుటుంబానికి చెందిన 12 మంది మృతి

gujarat cable bridge collapse

Updated On : October 31, 2022 / 12:48 PM IST

Gujarat Cable Bridge Collapse : గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో జరిగిన కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదం రాజ్‌కోట్‌ బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్‌ కళ్యాణ్‌జీ కుందరియా ఇంట్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఎంపీ మోహన్‌భాయ్‌ కళ్యాణ్‌జీ కుందరియా కుటుంబానికి చెందిన 12 మంది మృతి చెందారు. వారంతా తన సోదరి కుటుంబానికి చెందినవారని కుందరియా పేర్కొన్నారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారన్నారు.

మచ్చు నదిపై ఉన్న కేబుల్‌ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 141 మంది మృతి చెందగా, 113 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మరో 19 మంది గాయపడ్డారు. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైనవారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, స్థానిక సిబ్బంది రెస్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారని ఎంపీ చెప్పారు.

pm Modi : గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

మచ్చు నదిలో మునిగిపోయినవారి మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై దాదాపు 500 మందికిపైగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.