Punjab Jail: జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. సిద్ధూ మూసేవాలా హంతకులు మృతి

పంజాబ్, తరన్ తారన్‌లోని గొయిండ్వల్ జైలులో ఆదివారం ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులైన ఇద్దరు ఖైదీలు మరణించారు. మరో ఖైదీ తీవ్రంగా గాయపడ్డాడు.

Punjab Jail: జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. సిద్ధూ మూసేవాలా హంతకులు మృతి

Punjab Jail: పంజాబ్ జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు హంతకులు మరణించారు. ఈ ఇద్దరు మృతులూ సిద్ధూ మూసేవాలా హత్యలో ప్రధాన నిందితులుగా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్, తరన్ తారన్‌లోని గొయిండ్వల్ జైలులో ఆదివారం ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది.

Nikki Haley: శత్రు దేశాలకు సాయం నిలిపివేస్తాం.. పాక్, చైనాలకు కూడా: నిక్కీ హేలీ

ఈ ఘర్షణలో పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులైన ఇద్దరు ఖైదీలు మరణించారు. మరో ఖైదీ తీవ్రంగా గాయపడ్డాడు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా గత ఏడాది మేలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. వీరిలో కొందరు గొయిండ్వల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఖైదీల మధ్యే ఆదివారం ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో మన్‌దీప్ సింగ్ తుఫాన్, మన్మోహన్ సింగ్ అనే ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. కేషా అనే మరో ఖైదీ తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఈ ముగ్గురూ సిద్ధూ హత్యలో కీలక పాత్ర పోషించారు. వీళ్లు సిద్ధూపై కాల్పులు జరపడంతోపాటు, నిందితులు పారిపోయేందుకు వాహనాలు సమకూర్చారు. ఈ హత్య కేసుతోపాటు ఈ ముగ్గురిపై అనేక ఇతర కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.