తమిళనాడులో రక్తమోడిన రోడ్లు.. 24మంది మృతి

తమిళనాడు రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 24మంది చనిపోయారు. తిరుపూరు జిల్లా అవినాశిలో కేరళ ఆర్టీసీ బస్సును కంటైనర్

  • Published By: veegamteam ,Published On : February 20, 2020 / 03:35 AM IST
తమిళనాడులో రక్తమోడిన రోడ్లు.. 24మంది మృతి

తమిళనాడు రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 24మంది చనిపోయారు. తిరుపూరు జిల్లా అవినాశిలో కేరళ ఆర్టీసీ బస్సును కంటైనర్

తమిళనాడు రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 24మంది చనిపోయారు. తిరుపూరు జిల్లా అవినాశిలో కేరళ ఆర్టీసీ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 19మంది చనిపోయారు. 31మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. టైరు పేలడంతో ఎదురుగా వస్తున్న బస్సును కంటైనర్ ఢీకొట్టింది. బస్సు తిరుపూరు నుంచి తిరువనంతపురం వెళ్తోంది.

అటు సేలం జిల్లా ఓమలూరులో మరో ప్రమాద జరిగింది. కారు- ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు నేపాల్ వాసులు చనిపోయారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read More>>పదిహేను రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర