Minor Girl Death : అమానుషం.. జీన్స్ ధరిస్తోందని బాలికను హత్య చేసిన కుటుంబసభ్యులు

ఉత్తరప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 17ఏళ్ల బాలికను కుటుంబసభ్యులే కొట్టి చంపేశారు. దీనికి కారణం అమ్మాయి లైఫ్ స్టైలే(జీవన శైలి). ఎంత చెప్పినా పద్దతి మార్చుకోలేదని మైనర్ బాలికను ఆమె మామయ్యలే హత్య చేశారు.

Minor Girl Death : అమానుషం.. జీన్స్ ధరిస్తోందని బాలికను హత్య చేసిన కుటుంబసభ్యులు

Minor Girl Death

Minor Girl Death : ఉత్తరప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 17ఏళ్ల బాలికను కుటుంబసభ్యులే కొట్టి చంపేశారు. దీనికి కారణం అమ్మాయి లైఫ్ స్టైలే(జీవన శైలి). ఎంత చెప్పినా పద్దతి మార్చుకోలేదని మైనర్ బాలికను ఆమె తాత, మామయ్యలే హత్య చేశారు. డియోరియా జిల్లాకు చెందిన ఆ బాలిక తిండి, డ్రెస్సింగ్ స్టైల్, వ్యవహారం కుటుంబసభ్యులకు నచ్చేది కాదు. బాలిక ఎక్కువ సేపు ఇంటి బయటే గడిపేది. ఈ తీరు వారికి నచ్చలేదు. పద్ధతి మార్చుకోవాలని ఎన్నోసార్లు చెప్పారు. అయినా వినిపించుకోలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన ఇద్దరు మామయ్యలు బాలికను కొట్టారు. తీవ్ర గాయాలు కావడంతో బాలిక చనిపోయింది. కుటుంబసభ్యులు గుట్టుచప్పుడు కాకుండా బాలిక మృతదేహాన్ని రైల్వే బ్రిడ్జి పై నుంచి పడేశారు. కానీ, బాలిక డ్రెస్ బ్రిడ్జికి తగులుకుంది. దీంతో ఆమె డెడ్ బాడీ కింద పడలేదు. రోజు మొత్తం అలాగే వేలాడింది.

బ్రిడ్జికి వేలాడుతన్న మృతదేహాన్ని అటుగా వెళ్తున్న వ్యక్తి గుర్తించడంతో ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది. కస్యా-పట్నా హైవే పై ఉన్న పతన్ వా బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది. డెడ్ బాడీ చూసిన వ్యక్తి వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక హత్య కేసులో తాత(పరమ్ హన్స్ పాస్వాన్)ను అరెస్ట్ చేశారు. మామయ్యలు(వ్యాస్ పాస్వాన్, అర్వింద్ పాస్వాన్) పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు.

మృతురాలి తండ్రి పంజాబ్ లుధియానాలో పని చేస్తున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి లుధియానాకు వెళ్లాక బాలిక తీరు మారింది. వెస్ట్రన్ దుస్తులు(జీన్స్) ధరించేది. ఆ తర్వాత బాలిక, ఆమె తల్లి తిరిగి డియోరియాలోని మహుదీహ్ ప్రాంతంలోని స్వగ్రామానికి వచ్చేశారు. గ్రామానికి వచ్చినా బాలిక వెస్ట్రన్ దుస్తులు ధరించేది. ఎక్కువ సేపు ఇంటి బయటే గడిపేది. ఇది కుటుంబసభ్యులకు నచ్చలేదు.

జీన్స్ వేయడం మానేయాలని, ఎక్కువ సేపు బయట తిరగడం ఆపేయాలని నీ కూతురికి చెప్పు అంటూ బాలిక తల్లికి బాలిక మామయ్యలు చెప్పారు. దీనిపై బాలిక తన కుటుంబసభ్యులతో గొడవపడింది. పద్ధతి మార్చుకోను అని తేల్చి చెప్పింది. అంతేకాదు తన మామయ్య అర్వింద్ పై చేయి కూడా చేసుకుంది. దీంతో అర్వింద్ కోపంతో ఊగిపోయాడు. అర్వింద్, అతడి భార్య, అర్వింద్ తమ్ముడు వ్యాస్.. ముగ్గురూ కలిసి బాలికపై దాడి చేశారు. ఆమెను తోసేశారు. ఈ తోపులాటతో బాలిక తల గోడను బలంగా తాకింది. అంతే తల నుంచి రక్తం వచ్చింది. ఆ వెంటనే చనిపోయింది. కుటుంబసభ్యులు బాలిక మృతదేహాన్ని ఆటోలో బ్రిడ్జిపైకి తీసుకెళ్లారు. బ్రిడ్జి పైనుంచి పడేశారు. అయితే ఆమె డ్రెస్ బ్రిడ్జికి తగులుకోవడంతో మృతదేహం కిందకు పడలేదు. బ్రిడ్జికి వేలాడింది.