Wedding: వరుడుని కాదని వేరే వ్యక్తిని పెళ్లిచేసుకున్న వధువు.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు..
మహారాష్ట్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోవాల్సిన వరుడిని కాదని వధువు వేరే వ్యక్తిని వివాహమాడింది. స్థానికంగా ఈ వార్త సంచలనంగా మారింది. అసలు వధువు ఎందుకు వరుడును కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందా అని ఆరా..

Wedding: మహారాష్ట్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోవాల్సిన వరుడిని కాదని వధువు వేరే వ్యక్తిని వివాహమాడింది. స్థానికంగా ఈ వార్త సంచలనంగా మారింది. అసలు వధువు ఎందుకు వరుడును కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందా అని ఆరా తీయగా.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా మల్కాపూర్ ప్రాంగా గ్రామంలో ఈనెల 22న వివాహం నిశ్చమైంది. సాయంత్రం 4గంటలకు పెళ్లి వేడుకకు ముహూర్తం పెట్టారు. అనుకున్న విధంగా పెళ్లికి ఓ గంట ముందుగానే వధువు, కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. ముహూర్తం సమయం ముంచుకొస్తున్నా వరుడు మాత్రం పెళ్లి మండపం వద్దకు రాలేదు.
ముహూర్తం సమయం దాటిపోయిన వరుడు మాత్రం పెళ్లి మండపం వద్దకు రాకపోవటంతో వధువు బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వధువు తండ్రి పెళ్లికి వచ్చిన బంధువుల్లోని వ్యక్తితో తన కుమార్తె వివాహం జరిపించాడు. తీరా సాయంత్రం 8గంటల సమయానికి పెళ్లి మండపానికి చేరుకున్న వరుడు, అతని బంధువులు విషయం తెలిసి ఘర్షణకు దిగారు. దీంతో వధువు కుటుంబ సభ్యులు వరుడు బంధువులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 4గంటలకు పెళ్లి ముహూర్తం అయితే రాత్రి 8గంటలకు వస్తే ఎలా అంటూ నిలదీశారు.
వరుడు, అతని స్నేహితులు మద్యం తాగి, సాయంత్రం 4గంటలకు బదులుగా రాత్రి 8 గంటలకు మండపం వద్దకు వచ్చి గొడవకు దిగారని, మేము మా బంధువులలో ఒకరితో నా కుమార్తెకు వివాహం చేశామని తెలిపినట్లు వధువు తల్లి చెప్పారు. వధువు తండ్రి మాట్లాడుతూ.. పెళ్లి వేడుక ఏప్రిల్ 22న జరగాల్సి ఉండగా, వరుడి తరపు వారు డ్యాన్స్‌లో బిజీగా ఉన్నారు. పెళ్లి సమయం సాయంత్రం 4 గంటలకు అయితే రాత్రి 8 గంటలకు వేదిక వద్దకు చేరుకున్నారు. అందుకే నా కూతురికి నా బంధువుల్లో ఒకరితో పెళ్లి చేశానంటూ చెప్పాడు.
- MVA crisis: ముగిసిన మహా క్యాబినెట్ మీటింగ్.. అసెంబ్లీ రద్దుపై తేల్చని సీఎం
- Eknath Shinde: బీజేపీతో కలిస్తే.. శివసేన చీలదు: తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే
- పతనం అంచున ఉద్ధవ్ ఠాక్రే సర్కార్
- Maharashtra: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి గట్టి షాక్
- 9 Dead Bodies : ఒకే ఇంట్లో 9 మృతదేహాలు.. హత్యలా? ఆత్మహత్యలా?
1Telangana Covid Terror : తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు
2MVA Crisis: కూటమి నుంచి శివసేన బయటకు రావాలి: ఏక్నాథ్ షిండే
3DHFL: 34 వేల కోట్ల మోసం.. డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్రమోటర్లపై సీబీఐ కేసు
4Samsung Galaxy M13 5G : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫీచర్లు లీక్.. త్వరలో ఇండియాకు..!
5Cricketer Suicide Attempt : జట్టులోకి ఎంపిక చేయలేదని.. క్రికెటర్ ఆత్మహత్యాయత్నం
6KAPaul On Draupadi Murmu : అట్లుంటది పాల్తోని.. ఆమెను రాష్ట్రపతి చేయమని చెప్పింది నేనే-కేఏ పాల్
7Ketaki Chitale: 40 రోజులుగా జైల్లోనే నటి.. బెయిల్ మంజూరు
8Miami Airport Plane : విమానంలో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెనుప్రమాదం..!
9Kakatiya Utsavalu : జూలై 7 నుంచి కాకతీయ ఉత్సవాలు – మంత్రి శ్రీనివాస్ గౌడ్
10Patna High Court : జడ్జీల కోసం ఐఫోన్ 13ప్రో తక్కువ ధరకే కొననున్న పట్నా హైకోర్టు..!
-
Telegram Premium : టెలిగ్రామ్ మానిటైజేషన్ ప్లాన్ వచ్చేసింది.. ప్రీమియంతో బెనిఫిట్స్ ఏంటి?
-
Ramarao On Duty: రామారావు చార్జి తీసుకునేది అప్పుడే!
-
Xiaomi 12 Ultra : షావోమీ 12 అల్ట్రా ఫోన్ వస్తోంది.. జూలైలోనే లాంచ్..!
-
Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్
-
Samsung Galaxy F13 : శాంసంగ్ గెలాక్సీ F13 వచ్చేసింది.. ఈ నెల 29 నుంచే సేల్.. ధర ఎంతంటే?
-
Vaarasadu: ‘వారసుడు’ రాకతో నిజమైన సంక్రాంతి..!
-
Telugu Film Industry Strike: ఫిలిం ఛాంబర్లో నిర్మాతల సమావేశం.. షూటింగ్ ఆపేదే లేదు!
-
Pelli SandaD: పెళ్లిసందD ఓటీటీ డేట్ వచ్చేసిందోచ్!