Rakesh Master : డ్యాన్స్ డైరెక్టర్ రాకేష్ మాస్టర్ పై కేసు నమోదు

Rakesh Master : డ్యాన్స్ డైరెక్టర్ రాకేష్ మాస్టర్ పై కేసు నమోదు

Dance Director Rakesh Master

Rakesh Master : నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారంలో ఉండే కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ పై బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.   కొద్ది రోజుల క్రితం  ఒక  యూట్యూబ్    చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో  సినీ నృత్య దర్శకుడు   ఎస్.రామారావు ఎలియాస్ రాకేష్ మాస్టర్    శ్రీకృష్ణుడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని యాదవ సంఘ నాయకులు ఆరోపించారు.

ఈ మేరకు రాకేష్ మాస్టర్ తో  పాటు అతడి భార్య, యూ ట్యూబ్ నిర్వాహకులపై క్రిమినల్ కేసుల నమోదు చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు  యాదవ్‌, గ్రేటర్‌ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా … రాకేష్‌ మాస్టర్‌పై   ఐపీసీ 295ఎ,  298 సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా….కొందరు  వ్యక్తులు తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి….తనపై బెదిరింపులకు పాల్పడ్డారని రాకేష్ మాస్టర్‌  బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కృష్ణానగర్‌లోని తన ఫ్లాట్‌ వద్దకు  ఈ నెల 2వ తేదీన సాయి యాదవ్‌, ఇమ్రాన్‌తోపాటు మరికొంత మంది వచ్చారని..యూట్యూబ్‌ చానెల్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి  ప్రశ్నిస్తూ తనను దుర్భాషలాడుతూ.. బెదిరింపులకు పాల్పడ్డారని రాకేష్‌ మాస్టర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు  ఐపీసీ 448, 427, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.