CBI Raids In Hyderabad : హైదరాబాద్ లో కొనసాగుతున్న సీబీఐ సోదాలు.. పలువురి ఇళ్లలో తనిఖీలు

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. పాతబస్తీలోని ఆరు చోట్ల తనిఖీలు చేపట్టారు. నగరంలో ఉదయం నుంచి సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాల చెల్లింపుపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది.

CBI Raids In Hyderabad : హైదరాబాద్ లో కొనసాగుతున్న సీబీఐ సోదాలు.. పలువురి ఇళ్లలో తనిఖీలు

CBI

CBI Raids In Hyderabad : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. పాతబస్తీలోని ఆరు చోట్ల తనిఖీలు చేపట్టారు. నగరంలో ఉదయం నుంచి సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాల చెల్లింపుపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. దీనిలో భాగంగా ఓవైసీ ఆస్పత్రి డాక్టర్ అంజూమ్ సుల్తానా ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అంజూమ్ సుల్తానా భర్త ఓ ఆటో మొబైల్ కంపెనీ ఉద్యోగి. ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీపై సీబీఐ ఫోకస్ చేసింది. చంచల్ గూడలోనూ సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. అంజూమ్ సుల్తానా భర్త ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

ఇప్పటివరకు నిర్వహించిన సోదాల్లో కంపెనీ నిర్వహించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే ప్రస్తుతం అతను చేస్తున్న వ్యాపార సముదాయలకు సంబంధించిన వివరాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సోదాలు ముగిసిన తర్వాత సీబీఐ అధికారులు ప్రెస్ మీట్ ద్వారా సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే ఛాన్స్ ఉంది.

CBI Raids In TDP Leader House : టీడీపీ మహిళా నేత ఇంట్లో సీబీఐ సోదాలు

కాగా, ఇటీవలే హైదరాబాద్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. నగరంలోని పలు చోట్ల 40 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేశారు. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. ఎక్సెల్ టైర్ల కంపెనీతోపాటు ప్రధాన కార్యాలయంలో సోదాలు చేశారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అలాగే చెన్నైలోని హెడ్ క్వార్టర్స్ లోనూ సోదాలు చేశారు. ఐటీ అధికారులు 40 బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు.

బాచుపల్లి, చందానగర్ లోనూ తనిఖీలు కొనసాగించారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ కంపెనీకి చెందిన ఆరుగురు డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు చేశారు. బాచుపల్లిలోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ అడ్మిన్, అకౌంట్ ఆఫీసులు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా నగరంలో సీబీఐ సోదాలు కొనసాగిస్తోంది.