Exchange of Fire Chhattisgarh : చత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు, మావోయిస్టు మృతి
చత్తీస్గఢ్ లోని దంతేవాడ అటవీ ప్రాంతంలో ఈరోజు మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

Chhattisgarh Exchange Of Fire
Exchange of Fire Chhattisgarh : చత్తీస్గఢ్ లోని దంతేవాడ అటవీ ప్రాంతంలో ఈరోజు మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈకాల్పుల్లో ఒక మావోయిస్టు మరణించాడు. మరణించిన మావోయిస్టుపై రూ. 5లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసుల తెలిపారు.
దంతేవాడ అటవీప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) పోలీసులు శుక్రవారం గాలింపు జరుపుతుండగా వారికి మావోయిస్టులు ఎదురు పడ్డారు. అనుమానించిన పోలీసులు లొంగిపొమ్మని హెచ్చరించటంతో మవోయిస్టులు పోలీసులపై కాల్పులు ప్రారంభించారు.
Also Read : Gold Prices Today : తగ్గిన బంగారం ధరలు
ఈ కాల్పుల్లో ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన మల్లేష్ అనే కమాండర్ మృతి చెందాడు. ఇతనిపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్ధలంనుంచి 7.62 ఎంఎం పిస్టల్, 5 కిలోల ఐఈడీ, వైర్లు, రోజువారీ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.