Dammaiguda Girl Missing Case : చెరువులో బాలిక మృతదేహం.. దమ్మాయిగూడ చిన్నారి పోస్టుమార్టం రిపోర్టులో కీలక అంశాలు

దమ్మాయిగూడ చిన్నారి అనుమానాస్పద మృతి కేసులో చిన్నారి పోస్టుమార్టం రిపోర్టులో కీలక అంశాలు ఉన్నాయి. బాలిక ఊపిరితిత్తుల్లో నీరు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే, శరీరంపై..

Dammaiguda Girl Missing Case : చెరువులో బాలిక మృతదేహం.. దమ్మాయిగూడ చిన్నారి పోస్టుమార్టం రిపోర్టులో కీలక అంశాలు

Dammaiguda Girl Missing Case : దమ్మాయిగూడ చిన్నారి అనుమానాస్పద మృతి కేసులో చిన్నారి పోస్టుమార్టం రిపోర్టులో కీలక అంశాలు ఉన్నాయి. బాలిక ఊపిరితిత్తుల్లో నీరు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే, శరీరంపై ఎలాంటి గాయాలు లేవని నిర్ధారించారు. చెరువులో పడి నీళ్లు మింగటం వల్లే చిన్నారి చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు.

అయితే, చిన్నారి చెరువులో ఎలా పడిపోయి ఉంటుంది అనే దానిపై క్లారిటీ లేదు. చిన్నారి తనే స్వయంగా ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయిందా? లేదంటే ఎవరైనా తోసేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. బాలిక మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది. చిన్నారి మృతి చెందింది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కి చెందిన ఇందు.. దమ్మాయిగూడ ప్రభుత్వ స్కూల్ లో 4వ తరగతి చదువుతోంది. రోజూలాగే గురువారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన విద్యార్థిని సాయంత్రం పొద్దుపోయినా ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read..Husband Gives HIV Injection To Wife : దారుణం.. బలానికి మందులు అంటూ, భార్యకు HIV ఇంజెక్షన్ వేయించిన భర్త..!

రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఇంతలో షాకింగ్ విషయం వెలుగుచూసింది. దమ్మాయిగూడ చెరువులో పాప మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలిక మృతితో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. స్కూల్ కి వెళ్లిన చిన్నారి శవమై కనిపించిన ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది.

చిన్నారి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాప చెరువు వద్దకు ఎందుకు వెళ్లింది? ఎలా వెళ్లింది? ఎవరైనా తీసుకెళ్లారా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు.

Also Read..Missing Girl Died : మేడ్చల్ జిల్లాలో విషాదం.. జవహర్ నగర్ లో అదృశ్యమైన బాలిక మృతి

గురువారం ఉదయం స్కూల్‌ కి వెళ్లిన బాలిక చెరువులో విగతజీవిగా కనిపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జవహర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన 4వ తరగతి విద్యార్థిని (ఇందు) గురువారం ఉదయం 9 గంటలకు స్కూల్ కి వెళ్లింది. అయితే పాప కనిపించట్లేదని స్కూల్ టీచర్ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. కంగారుపడి స్కూల్‌ దగ్గరకి వెళ్లి చూడగా పాప బ్యాగు మాత్రమే ఉంది. చుట్టుపక్కల వెతికినా లాభం లేకపోయింది. దాంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

విచారణ చేపట్టిన పోలీసులు.. ఓ కెమెరాలో బాలిక కాలి నడకన వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వాటి ఆధారంగా బాలికను వెతికారు. దమ్మాయిగూడలోని అంబేడ్కర్‌ నగర్‌ చెరువులో మృతదేహం లభ్యమైంది.

పదేళ్ల పాప చెరువులో విగతజీవిగా కనిపించడం సంచలనంగా మారింది. అసలేం జరిగింది? అనేది అంతుచిక్కడం లేదు. బాలికను ఎవరైనా కిడ్నాప్‌ చేసి చంపేశారా? లేదా ఏదైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. స్కూల్‌కు వెళ్లిన బాలిక.. బ్యాగ్‌ ని అక్కడే పెట్టి ఎందుకు బయటకు వచ్చింది? తనే స్వయంగా బయటకు వెళ్లిందా? లేక ఎవరైనా రమ్మని పిలిచారా? అసలేం జరిగి ఉంటుంది? ఇలా విభిన్న కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.