RIP General Bipin Rawat :హెలికాఫ్టర్ ప్రమాదానికి ముందు..ప్రమాదం తర్వాత అసలు జరిగిందిదే

తమిళనాడు రాష్ట్రంలోని వెల్లింగ్టన్ లోని ఢిఫెన్స్ స్టాఫ్ కాలేజీలో బుధవారం మధ్యాహ్నాం ఉపన్యాసం ఇవాళ్సి ఉండింది.

RIP General Bipin Rawat :హెలికాఫ్టర్ ప్రమాదానికి ముందు..ప్రమాదం తర్వాత అసలు జరిగిందిదే

Ar878

RIP General Bipin Rawat :
– తమిళనాడు రాష్ట్రంలోని వెల్లింగ్టన్ లోని ఢిఫెన్స్ స్టాఫ్ కాలేజీలో బుధవారం మధ్యాహ్నాం ఉపన్యాసం ఇవాళ్సి ఉండింది.
– ఇందు కోసం రావత్ తన భార్య మధులికతో పాటు తన సిబ్బంది 9మందితో బుధవారం ఉదయం 9గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి తమిళనాడులోని సూలూరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు11:45 గంటలకు చేరుకున్నారు.
– సూలూరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి భారత వాయుసేనకు చెందిన Mi-17V5 హెలికాఫ్టర్ లో 11:48 గంటల సమయంలో బిపిన్ రావత్ దంపతులో కలిపి మొత్తం 14 మంది వెల్లింగ్టన్ కు బయల్దేరారు.
– వెల్లింగ్టన్ లోని గమ్యస్థానానికి చేరడానికి 5 నిమిషాల ముందు మధ్యాహ్నాం 12:22గంటల సమయంలో హెలికాప్టర్..కూనూర్ కి 7 కిలోమీటర్ల దూరంలోని కట్టేరి అనే ఊరి వద్దనున్న టీ ఎస్టేట్ లోని చిన్న ఆవాసానికి దగ్గరగా ఉన్న ఒక లోయలో కూలిపోయింది.

– ప్రమాదంలో హెలికాఫ్టర్ పూర్తిగా కాలిపోయింది.

–  స్థానికులు ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకుని పోలీసుల‌ను, అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసి స‌మాచారం అందించారు.
–  ఈ హెలికాప్టర్ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సైన్యం రంగంలోకి దిగి గాలింపు, సహాయక చర్యలు చేపట్టింది. స్థానిక పోలీసులు,అధికారులు,స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
– కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బిపిన్ రావత్,ఆయన భార్య సహా మరికొందరిని అంబులెన్స్ లలో వెల్లింగ్టన్ హాస్పిటల్ కు తరలించారు.

–  సాయంత్రం 6:30 సమయంలో బిపిన్ రావత్ తో సహా ఆర్మీ హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన ఘ‌ట‌న‌లో 13 మంది దుర్మ‌ర‌ణం చెందిన‌ట్లు అధికారికంగా వాయుసేన ప్ర‌క‌టించింది.
– అయితే ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్ లోని 13మంది మృతి చెందగా..ఆర్మీ గ్రూప్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్ 90 శాతం గాయాలతో వెల్లింగ్టన్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.

–  దట్టమైన పొగమంచు కారణంగా విజిబులిటీ తగ్గిపోవడమే ప్రదామానికి కారణమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

–  ఈ ప్రమాద ఘటనపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది.

– ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఢిల్లీ నుంచి ఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లారు.

– బిపిన్ రావత్ దంపతులతో పాటు మిగిలిన 13మంది భద్రతా బలగాల మృతిపై ప్రధాని మోదీ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు,ఆర్మీ అధికారులు సంతాపం తెలిపారు.

– హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య మధులికతో పాటు మిగిలిన 11 మంది సాయుధ బలగాల మృతదేహాలు గురువారం సాయంత్రంలోగా ఢిల్లీ చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

ALSO READ Army Chopper Crash : భారత తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి..20ఏళ్లకే ఆర్మీలో చేరి..