Hyderabad : మొండెం లేని మహిళ తల కేసులో షాకింగ్ విషయాలు.. ఆమెను చంపి ముక్కలు చేసి.. హైదరాబాద్‌లో ఢిల్లీ శ్రద్దావాకర్ తరహా దారుణం

Hyderabad Severed Head : మృతదేహం దుర్వాసన రాకుండా పెర్ఫ్యూమ్ చల్లాడు. డెటాయిల్, ఫినాయిల్ తో ఇంటిని తరుచుగా శుభ్రం చేశాడు.

Hyderabad : మొండెం లేని మహిళ తల కేసులో షాకింగ్ విషయాలు.. ఆమెను చంపి ముక్కలు చేసి.. హైదరాబాద్‌లో ఢిల్లీ శ్రద్దావాకర్ తరహా దారుణం

Hyderabad (Photo : Google)

Hyderabad – Man Kills Woman : హైదరాబాద్ లో దారుణం జరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ శ్రద్దా వాకర్ తరహా ఘటన నగరంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మహిళను చంపి ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచడం కలకలం రేపింది.

మలక్ పేట్ లో 6 రోజుల క్రితం మొండెం లేని మహిళ తల లభించిన కేసు విచారణలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. మృతురాలిని ఎర్రం అనురాధగా గుర్తించారు. ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుంది. అనురాధ వడ్డీ వ్యాపారం చేస్తుందని, ఆ గొడవల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ శ్రద్దావాకర్ ఘటన తరహాలోనే.. నిందితుడు.. అనురాధ తల, మెండెం వేరు చేసి శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడిని పోలీసులు చంద్రమౌళిగా గుర్తించారు. ”చంద్రమౌళి ఇంట్లోనే ఎర్రం అనురాధ అద్దెకు ఉంటుంది. వడ్డీ వ్యాపారం చేసే రాధ నుంచి చంద్రమౌళి రూ.18 లక్షల తీసుకున్నాడు. ఆ డబ్బులు వ్యవహారంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నయి. దాంతో అనురాధను చంద్రమౌళి హత్య చేశాడు. ఈ విషయం బయటపడకుండా స్కెచ్ వేశాడు. శరీర భాగాలను ముక్కలు ముక్కలు చేశాడు. కాళ్లను ఫ్రిజ్ లో పెట్టాడు. మిగిలిన శరీర భాగాలను కవర్ లో కట్టి బకెట్ లో పెట్టాడు” అని పోలీసులు తెలిపారు. చంద్రమౌళిని హత్య జరిగిన చోటుకు తీసుకెళ్లిన పోలీసులు.. హత్య జరిగిన తీరును తెలుసుకున్నారు.(Hyderabad)

Also Read..Goa Robbery : బీకేర్ ఫుల్.. ఇంటి బయట ఒంటరిగా కూర్చుంటున్నారా? ఎంత ప్రమాదమో చూడండి.. షాకింగ్ వీడియో

ఆరు రోజుల క్రితం మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగూడలో మూసీ నది వద్ద మొండెం లేని మహిళ తల లభించడం కలకలం రేపింది. ఈ కేసుని సవాల్ తీసుకున్న పోలీసులు మిస్టరీ చేధించారు. హతురాలిని ఎర్రం అనురాధగా గుర్తించారు. కేర్ హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తుందని తెలుసుకున్నారు. హతురాలు ఎర్రం అనురాధే అని మృతురాలి సోదరి, బావ ధృవీకరించారు. మృతురాలు వడ్డీ వ్యాపారం చేస్తుందని, డబ్బు విషయంలోనే హత్యకు గురైనట్లు అనురాధ సోదరి తెలిపింది.

హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం రేపిన ఈ కేసు వివరాలను సౌత్ ఈస్ట్ డీసీపీ రోపేష్ మీడియాకు తెలియజేశారు. ”డబ్బు వ్యవహారంలో గొడవలు వచ్చాయి. అనురాధపై చంద్రమౌళి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఛాతి, పొట్టపై కత్తితో పొడిచాడు. దాంతో అనురాధ అక్కడికక్కడే మృతి చెందింది. 12వ తేదీన హత్య చేశాడు. తల, మొండెం వేరు చేశాడు. శరీరాన్ని ముక్కలు చేశాడు. వాటిని ఫ్రిజ్ లో పెట్టాడు.(Hyderabad)

17వ తేదీన మూసీ నదిలో తలను పడేశాడు. ఆ తర్వాత నిందితుడు మృతదేహాన్ని పారవేసేందుకు రెండు స్టోన్ కటింగ్ మెషీన్లను (చిన్నవి) కొనుగోలు చేశాడు. తలను వేరు చేసి బ్లాక్ కలర్ పాలిథిన్ కవర్‌లో ఉంచాడు. ఆ తర్వాత కాళ్లు, చేతులను వేరు చేశాడు. స్టోన్ కట్టింగ్ మెషిన్, కాళ్లు, చేతులు ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. మే 15న మృతురాలి తలను ఆటోలో తీసుకెళ్లి డంపింగ్ ప్రదేశంలో పడేశాడు.(Hyderabad)

ఇంట్లో మృతదేహం నుంచి దుర్వాసన రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫినాయిల్, డెటాల్, పెర్ఫ్యూమ్ అగర్ బత్తి, కర్పూరం, పెర్ఫ్యూమ్ స్ప్రే బాటిళ్లను తీసుకొచ్చి ఇంటిని క్లీన్ చేశాడు. చుట్టుపక్కల దుర్వాసన వ్యాపించకుండా ఉండటానికి క్రమం తప్పకుండా ముక్కలు చేసిన శరీర భాగాలపై పెర్ఫ్యూమ్ చల్లాడు. ఆ తర్వాత నిందితుడు మృతురాలి సెల్‌ఫోన్‌ తీసుకుని ఆమెకు తెలిసిన వ్యక్తులకు మెసేజ్‌లు పంపాడు. అనురాధ బతికే ఉన్నట్లు, ఎక్కడో ఉన్నట్లు నమ్మబలికాడు” అని కేసు వివరాలను డీసీపీ వెల్లడించారు.

Also Read..Karnataka : OMG.. పెట్రోల్ బంకులో ఫోన్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో చూడండి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

అసలేం జరిగిందంటే..
మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగూడ మూసీ నది వద్ద 6రోజుల క్రితం ఓ మహిళ తల కనిపించింది. నల్లని ప్లాస్టిక్ కవర్ లో ఉన్న తలను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు స్పాట్ కి వెళ్లారు. అక్కడ మొండెం లేని మహిళ తలను గుర్తించారు. ఆ తల ఎవరిది? మొండెం ఎక్కడుంది? హత్యకు కారణం ఏంటి? అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. ఎక్కడో హత్య చేసి మొండెం నుంచి తల వేరు చేసి మూసీ నదిలో పడేసిట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు.(Hyderabad)

పోలీసులు ఆ తలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మొండెం కోసం గాలింపు చేపట్టారు. తల ఆధారంగా ఆ మహిళ ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మిస్టరీని చేధించారు. మృతురాలని కనుగొన్నారు. ఆమె కేర్ ఆసుపత్రిలో పని చేస్తున్న నర్సు ఎర్రం అనురాధగా గుర్తించారు. వడ్డీ వ్యాపారం చేస్తుందని తెలుసుకున్నారు. డబ్బు వ్యవహారంలో గొడవల కారణంగా రాధను హత్య చేసుంటారని ఓ నిర్దారణకు వచ్చారు. ఈ కేసులో పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఈ కేసు విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అనురాధను హత్య చేసింది చంద్రమౌళి అని గుర్తించారు. చంద్రమౌళి.. అనురాధ దగ్గర అప్పుగా లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడగటంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. ఇంట్లోనే అనురాధను హత్య చేశాడని, తల మొండెం వేరు చేశాడని, తలను తీసుకెళ్లి మూసీ నదిలో పడేశాడని వెల్లడించారు. మిగతా శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్ లోనే పెట్టాడని పోలీసులు చెప్పారు.