దిశ నిందితుడి ఇంట్లో తీవ్ర విషాదం : చావు బతుకుల మధ్య తండ్రి

‘దిశ’ హత్యాచారం కేసులో నిందితుడు, పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన చెన్నకేశవుల ఇంట్లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెన్నకేశవులు ఘటన మర్చిపోకముందే ఆ

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 03:38 AM IST
దిశ నిందితుడి ఇంట్లో తీవ్ర విషాదం : చావు బతుకుల మధ్య తండ్రి

‘దిశ’ హత్యాచారం కేసులో నిందితుడు, పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన చెన్నకేశవుల ఇంట్లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెన్నకేశవులు ఘటన మర్చిపోకముందే ఆ

‘దిశ’ హత్యాచారం కేసులో నిందితుడు, పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన చెన్నకేశవుల ఇంట్లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెన్నకేశవులు ఘటన మర్చిపోకముందే ఆ కుటుంబానికి పెద్ద షాక్ తగిలింది. చెన్నకేశవులు తండ్రి కురుమయ్య రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నారాయణ్ పేట్ జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో బైక్‌పై వెళ్తున్న కురుమయ్యను ఇన్నోవా వాహనం వేగంగా ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన ఆయనను స్థానికులు వెంటనే మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కురుమయ్యకు డాక్టర్లు ప్రథమ చికిత్స అందించారు. ఆయన కుడికాలు విరిగిపోయిందని తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఈ ఘటనపై వివరాలు సేకరించారు. కురుమయ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయన్ని మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్‌ నిమ్స్ కు తరలించారు. గురువారం(డిసెంబర్ 26,2019) వ్యక్తిగత పని నిమిత్తం బైక్‌పై జక్లేర్‌కు వెళ్లిన కురుమయ్య తిరిగి గుడిగుండ్లకు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మక్తల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దిశ హత్యాచారం కేసులో మొత్తం నలుగురు నిందితులు ఉన్నారు. ఏ1 నిందితుడు ఆరిఫ్ స్వగ్రామమే జక్లేర్. మిగిలిన నిందితులు జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు స్వగ్రామం గుడిగుండ్ల. ఇప్పుడు చెన్నకేశవుల తండ్రి కురుమయ్య జక్లేర్ గ్రామంలోనే రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆ ప్రాంతం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఓ వైపు కొడుకు చావు మరిచిపోకముందే.. తండ్రి చావు బతుకుల మధ్యన ఉండడం చెన్నకేశవులు కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది.

దిశ ఘటన యావత్ భారత దేశాన్ని కదిలించింది. షాద్ నగర్ దగ్గర దిశను సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన అందర్నీ షాక్ కు గురి చేసింది. ఈ ఘటన తర్వాత దిశ హత్యాచార నిందితులను ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. మొన్నటి వరకు వారి మృతదేహాలు గాంధీ ఆస్పత్రిలోనే ఉండగా ఇటీవలే వారి మృతదేహాలను ఖననం చేశారు. నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య గర్భవతి కావటం, తన భర్తతో పాటే తనను చంపేయాలని ఆమె ఆందోళన చెయ్యటం చర్చనీయాంశం అయ్యాయి. ఇదే కుటుంబాన్ని తాజాగా మరో విషాదకర సంఘటన కలచివేసింది.