రాజన్నసిరిసిల్ల జిల్లాలో అమానుషం : అటెండర్ తో చెప్పులు తుడిపించుకున్న డీఎంహెచ్ఓ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. డీఎంహెచ్ఓ అధికారి...అటెండర్ తో తన చెప్పులు శుభ్రం చేయించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. 

  • Published By: veegamteam ,Published On : January 5, 2020 / 09:02 AM IST
రాజన్నసిరిసిల్ల జిల్లాలో అమానుషం : అటెండర్ తో చెప్పులు తుడిపించుకున్న డీఎంహెచ్ఓ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. డీఎంహెచ్ఓ అధికారి…అటెండర్ తో తన చెప్పులు శుభ్రం చేయించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఇటీవల యువకులను చితకబాదిన పోలీసుల ఘటన మరువకముందే మరో ప్రభుత్వ అధికారి పెత్తనం చెలాయించాడు. తన కిందిస్థాయి వ్యక్తులతో అమర్యాదగా ప్రవర్తించి విమర్శల పాలయ్యారు. తంగళ్లపల్లి పీహెచ్ సీ సెంటర్ కు వచ్చిన డీఎంహెచ్ఓ అధికారి…అటెండర్ తో తన చెప్పులు శుభ్రం చేయించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. 

తంగళ్లపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యేందుకు డీఎంహెచ్ ఓ చంద్రశేఖర్ వెళ్లారు. ఈక్రమంలో డీఎంహెచ్ఓ చంద్రశేఖర్ తన చెప్పులపై కేండిల్ మరకలతోపాటు ఇతర మరకులు ఉండటంతో శుభ్రం చేయాలని అటెండర్ ను ఆదేశించారు. దీంతో ఉన్నతాధికారి ఆదేశాలతో అటెండర్ బయటికి వెళ్లి చంద్రశేఖర్ చెప్పులను శుభ్రం చేస్తున్న క్రమంలో అక్కడున్న కొంతమంది ఫొటోలు చిత్రీకరించారు. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.  

ఒక వేళ అధికారి ఆదేశాలను తిరస్కరిస్తే ఏమైనా చర్యలు తీసుకుంటాడేమోనని భయంతో అటెండర్ చెప్పులు శుభ్రం చేసినట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఇటీవల వివాదాస్పదంగా మారింది. డీఎంహెచ్ఓ చంద్రశేఖర్ అటెండర్ తో చెప్పులు తుడిపించుకున్న ఘటన జిల్లాలో చర్చనీయాంశం అయింది. ఈ విషయంపై డీఎంహెచ్ఓ ను వివరణ కోరగా చెప్పులపై కేండిల్ మరకలు పడ్డాయని..అవి తూడవమని చెప్పడం జరిగిందని వివరణ ఇచ్చారు. 

తోటి ఉద్యోగి పట్ల ఉన్నతాధికారి మానవత్వ విలువలు పాటించాల్సివుంది. కానీ చెప్పులు తుడిపించుకోవడం, వ్యక్తిగత పనులు చేయించుకోవడం వివాదాస్పదం అవుతుంది. డీఎంహెచ్ఓ చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని అటెండర్, స్థానికులతోపాటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారు? చంద్రశేఖర్ పై చర్యలు తీసుకుంటారా? లేదా వేచి చూడాల్సివుంది.