Delhi : ఢిల్లీలో రూ.434 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం

ఆపరేషన్  బ్లాక్&వైట్ పేరుతో ఢిల్లీ విమానాశ్రయం ఎయిర్ కార్గో నుంచి 55 కిలోల హెరాయిన్‌ను రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Delhi : ఢిల్లీలో రూ.434 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం

Delhi Heroin

Delhi :  ఆపరేషన్  బ్లాక్&వైట్ పేరుతో ఢిల్లీ విమానాశ్రయం ఎయిర్ కార్గో నుంచి 55 కిలోల హెరాయిన్‌ను రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు స్వాధీనం  చేసుకున్నారు. హెరాయిన్ ను అక్రమ మార్గంలో దిగుమతి చేసుకున్న వ్యక్తిని అధికారులు అరెస్టు చేసారు.

అనంతరం అతనిచ్చిన సమాచారంతో పంజాబ్, హర్యానాల నుంచి మరో 7 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న 62 కిలోల హెరాయిన్ విలువ రూ.434 కోట్ల రూపాయలు ఉంటుందని నిర్ధారించారు.

ఉగాండాలోని ఎంటెబ్బే నుంచి దుబాయ్ మీదుగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో కాంప్లెక్స్ ద్వారా ఈమొత్తం తతంగం నడిచినట్లు డీఆర్ఐ అధికారులు ప్రకటించారు. దేశంలో పట్టుబడిని అతి పెద్ద హెరాయిన్ కేసు అని అధికారులు తెలిపారు. 126 ట్రాలీ సూట్ కేసుల హ్యాండిల్ ట్యూబ్ లలో వీటిని దాచిపెట్టి తీసుకు వచ్చారు.

Also Read : Black Cobras : మట్టి కుండలో బయటపడ్డ 90 నాగుపాములు