Mining Scam : మైనింగ్ స్కామ్… బీహార్, జార్ఖండ్ లలో ఈడీ సోదాలు

మైనింగ్ స్కాంకు సంబంధించి జార్ఖండ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో సోదాలు  నిర్వహిస్తున్నారు.

Mining Scam : మైనింగ్ స్కామ్… బీహార్, జార్ఖండ్ లలో ఈడీ సోదాలు

mining scam jarkhand

Mining Scam : మైనింగ్ స్కాంకు సంబంధించి జార్ఖండ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో సోదాలు  నిర్వహిస్తున్నారు. బీహార్, జార్ఖండ్ లలో రాజకీయ నాయకులకు అత్యంత సన్నిహితుడైన ప్రేమ్ ప్రకాశ్ అనే వ్యక్తికి   చెందిన కార్యాలయాలు ఇళ్లపై ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమ్ ప్రకాశ్ కు చెందిన రెండు రాష్ట్రాల్లోనూ  సుమారు 20  చోట్ల ఏక కాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

ప్రేమ్ ప్రకాశ్ కు రాజకీయ నాయకులతో గట్టి సంబంధాలు ఉన్నాయి. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఈడీ జులై 8న సాహెబ్ గంజ్, బర్హయిత్, రాజ్ మహాల్, మీర్జా పోస్ట్ లలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు  రాజకీయ  సన్నిహితుడైన పంకజ్ మిశ్రాతో పాటు అతని సహచరులు బచ్చు యాదవ్ తదితరులకు సంబంధించిన 19 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ తర్వాత పంకజ్ మిశ్రాను ఈడీ విచారణకు పిలిచింది. ఆయన అనారోగ్య కారణాలు చెప్పి గైర్హాజరు కావటంతో మనీ లాండరింగ్ కేసులో జులై 19న ఈడీ మిశ్రాను అరెస్ట్ చేసింది.

అక్రమ మైనింగ్ స్కాంలో జులైలో జరిపిన దాడులలో ఈడీ 50 బ్యాంకు ఖాతాల్లోని రూ. 13.32 కోట్ల నిధులను సీజ్ చేసింది. జార్ఖండ్ లో జరిగిన రూ. 100 కోట్ల అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై ఈడీ విచారణ జరుపుతున్నట్లు పేర్కోంది.

Also Read : Anil Ambani : పన్ను ఎగవేతలపై అంబానీకి ఐటీ శాఖ నోటీసులు