SI Killed Husband: వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని.. దారుణానికి పాల్పడిన మహిళా ఎస్ఐ

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను మహిళా ఎస్ఐ హత్యచేయించింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. విచారణ జరిపిన పోలీసులు మహిళా ఎస్ఐ‌తో పాటు హత్యకు సహకరించిన నిందితులను అరెస్టు చేశారు.

SI Killed Husband: వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని.. దారుణానికి పాల్పడిన మహిళా ఎస్ఐ

Illegal Affair

SI Killed Husband: వివాహేతర సంబంధాలతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కొన్ని అక్రమ సంబంధాలు కట్టుకున్నవారి ప్రాణాలనుసైతం తీసేస్థాయికి వెళ్తున్నాయి. పరాయి వ్యక్తుల మోజులో పడి కొందరు మహిళలు భర్తనుసైతం హత్యచేసేందుకు వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను మహిళా ఎస్ఐ హత్యచేయించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Wife Illegal Affair: ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య.. ఐదు నెలల తర్వాత నిందితులను పట్టించిన సెల్ ఫోన్.. ఎలా అంటే?

కృష్ణగిరి జిల్లా ఊత్తంకరై జిల్లా కల్లాలికి చెందిన సెంథిల్ కుమారు (48) పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య చిత్ర (44) సింగారపేట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా పనిచేస్తుంది. వీరిద్దరి వివాహబంధం కొన్నేళ్లు సజావుగా సాగింది. కానీ, భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవటంతో ఇరువురి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. భార్య వివాహేతర సంబంధంపై భర్త పలుసార్లు అడ్డుచెప్పినప్పటికీ వినిపించుకోకపోవటంతో వీరి మధ్య ఘర్షణలకు దారితీశాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్న భర్తను శాశ్వితంగా తొలగించాలని మహిళా ఎస్ఐ నిర్ణయించుకుంది.

Illegal affair: నీ భార్య నాతో ఏం చేస్తుందో చూడంటూ భర్తకు వీడియో.. పోలీస్ ఎంట్రీతో..

సెప్టెంబర్ 16న సెంథిల్ కుమార్ అదృశ్యమయ్యాడు. వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో భార్యే (మహిళా ఎస్ఐ) సెంథిల్ కుమార్ ను హత్య చేయించినట్లు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కిరాయి ముఠాతో తన భర్తను హత్యచేయించినట్లు మహిళా ఎస్ఐ ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన మహిళా మంత్రగత్తె సరోజ, విజయ్ కుమార్, రాజ పాండ్యన్ లనుకూడా అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారీలో ఉండటంతో వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.