Girl Raped By Father : విజయవాడలో అమానుషం-ఐదేళ్ల కూతురుపై తండ్రి అత్యాచారం

విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రే కూతురుపై అత్యాచారం చేసాడు. కూతురు బాధపడుతుంటే తల్లి విషయం తెలుసుకుంది. భర్తపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

Girl Raped By Father : విజయవాడలో అమానుషం-ఐదేళ్ల కూతురుపై తండ్రి అత్యాచారం

Girl Raped by Father

Updated On : September 8, 2021 / 4:28 PM IST

Girl Raped By Father :  విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రే కూతురుపై అత్యాచారం చేసాడు. కూతురు బాధపడుతుంటే తల్లి విషయం తెలుసుకుంది. భర్తపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ తోపాటు… వికాస్ ఇంజనీరింగ్ కాలేజీల్లో చినబాబు అనే వ్యక్తి పిడి గా పనిచేస్తున్నాడు. చినబాబు కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఐదేళ్ల కూతురు ఉంది.

కామంతో కళ్లు మూసుకు పోయిన చినబాబు ఏ తండ్రి చేయని నీచపు పని చేశాడు. భార్య ఇంట్లో లేని సమయం చూసి తన ఐదేళ్ళ కూతురుపై అత్యాచారంచేశాడు. ఆతర్వాత బాలిక  తీవ్రమైన బాధతో విలవిలలాడి పోయింది. కూతురు బాధ పడుతుంటే తల్లి ఏంటని అడిగింది.  తండ్రి తనపై చేసిన  నీచపు పనిని తల్లికి వివరించింది ఆచిన్నారి.

ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే కన్న కూతురు పై అత్యాచారం చేయటం జీర్ణించికోలేని భార్య…. వెంటనే భర్తపై విజయవాడలోని దిశ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.  నిందితుడిపై పోక్సో చట్టంకింద కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలైన బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  భార్య పోలీసు కేసు పెట్టేసరికి  నిందితుడు పరారయ్యాడు.  కేసు ఉపసంహరించుకోవాలని భార్యను బెదిరిస్తూ ఫోన్లు చేస్తున్నాడు. కూతురుపై  జరిగిన అన్యాయంపై  పోరాటానికి తల్లి  సిధ్ధపడింది. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.