Road Accident: రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం ఖైదీ సహా ఐదుగురు మృతి

రాజస్థాన్ లో మంగళవారం తెల్లవారు జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసు సిబ్బంది సహా ఒక నిందితుడు మృతి చెందారు

Road Accident: రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం ఖైదీ సహా ఐదుగురు మృతి

Acci

Updated On : February 15, 2022 / 11:42 AM IST

Road Accident: రాజస్థాన్ లో మంగళవారం తెల్లవారు జామున(సోమవారం అర్ధరాత్రి దాటాక) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో నలుగురు పోలీసు సిబ్బంది సహా ఒక నిందితుడు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా కోట్‌పుత్లీ ప్రాంతంలోని భాబ్రూ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. పోలీస్ వాహనం డివైడర్‌పై ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు పోలీసులు సహా, ఒక నిందితుడు అక్కడిక్కడే మరణించారు. మృతులు గుజరాత్ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన పోలీస్ సిబ్బంది. ఢిల్లీ నుంచి ఓ నిందితుడిని గుజరాత్ తరలిస్తుండగా ఈప్రమాదం చోటుచేసుకుంది.

Also read: Jio Mobile: “గ్లాన్స్”లో రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్ “జియో”

ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జవగా.. అందులో ఉన్న ఐదుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న జైపూర్ పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ.. పొగమంచు, డ్రైవర్ నిద్రమత్తె ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై భాబ్రూ పోలీసులు గుజరాత్ పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదంపై ఇరు రాష్ట్రాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read: Freedom Convoy: కెనడా ప్రధాని నోట “ఎమర్జెన్సీ మాట” ? నివ్వెర పోతున్న ప్రపంచ దేశాలు