Freedom Convoy: కెనడా ప్రధాని నోట “ఎమర్జెన్సీ మాట” ? నివ్వెర పోతున్న ప్రపంచ దేశాలు

కెనడా దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చెలరేగుతున్న నిరసనలను అణిచివేసేందుకు ఆదేశ ప్రధాని జస్టిన్ ట్రూడో "ఎమర్జెన్సీ చట్టాలను" ప్రయోగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Freedom Convoy: కెనడా ప్రధాని నోట “ఎమర్జెన్సీ మాట” ? నివ్వెర పోతున్న ప్రపంచ దేశాలు

Cadana

Freedom Convoy: కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి చేయడంపై కెనడా దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చెలరేగుతున్న నిరసనలను అణిచివేసేందుకు ఆదేశ ప్రధాని జస్టిన్ ట్రూడో “ఎమర్జెన్సీ చట్టాలను” ప్రయోగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సోమవారం మాట్లాడుతూ, “ఫ్రీడమ్ కాన్వాయ్” నిరసనలతో సరిహద్దులు మూసివేయాల్సి వచ్చిందని, దేశ రాజధానిలోనూ కొన్ని ప్రాంతాలను నిరసనకారులు స్తంభింపజేశారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ, విశ్వసనీయ వ్యాపార భాగస్వామిగా కెనడా యొక్క ఖ్యాతిని దెబ్బతీస్తున్నాయని ట్రూడో పేర్కొన్నారు. నిరసనల అణిచివేతకు పోలీసు బలగాలను విస్తృతంగా మోహరింపజేసి..ప్రభుత్వం నుంచి వివిధ కార్యకలాపాలకు అందాల్సిన ఆర్థిక సహాయాన్ని నిలిపివేయడంతో పాటు..క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్‌లను “టెర్రర్ ఫైనాన్సింగ్ పర్యవేక్షణ” కిందకు తీసుకురావడానికి విస్తృత చర్యలు తీసుకోనున్నట్లు జస్టిన్ ట్రూడో వెల్లడించారు.

Also read: Varla Ramayya: కడప కేంద్ర కారగార జైలర్ పి.వరుణారెడ్డిని బదిలీ చేయండి: వర్ల రామయ్య

నిరసనలను అణిచివేసేందుకు అత్యంత అరుదుగా ఉపయోగించే “అత్యవసర అధికారాలను” సక్రియం చేస్తానని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. అయితే ఎమర్జెన్సీ చట్టాలను అమలు చేస్తానన్న జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలపై కెనడాలోని కొన్ని ప్రావిన్స్ లలో తీవ్ర దుమారం రేగింది. నిరసనకారులను అడ్డుకోవడం చేతగాని ప్రభుత్వానికి..చట్టాలను ఉపయోగించుకునే హక్కు ఉందా అంటూ ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటే చాలని..ఎమర్జెన్సీ చట్టాలు అమలు చేయాల్సిన అవసరంలేదని అల్బెర్టా, క్యూబెక్, మానిటోబా మరియు సస్కట్చేవాన్ ప్రాంతీయ ప్రధానులు హితవుపలికారు. దీనిపై దేశ ప్రధాని ట్రూడో స్పందిస్తూ.. ఎమర్జెన్సీ చర్యలు.. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయని చెప్పుకొచ్చారు.

Also read: Anti-Conversion Law: మతమార్పిడిపై గుజరాత్ ప్రభుత్వ అప్పీల్ పై హైకోర్టుకు నోటీసు జారీచేసిన సుప్రీం కోర్ట్

ఇదిలాఉంటే.. దేశంలో క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్‌(నిధుల సమీకరణ సంస్థలు)లను కట్టడి చేయడానికి.. దేశంలోని మనీలాండరింగ్ నిరోధక చట్టాలను, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ నియమాల పరిధిని విస్తృతం చేస్తూ.. కెనడా ఆర్ధికమంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుత నిరసనలకు కారణమైన అనేక చర్యలకు అమెరికా నుంచి దొడ్డిదారిన నిధులు వస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో “ఫ్రీడమ్ కాన్వాయ్” పేరుతో భారీ లారీలను కెనడా రోడ్లపై వదిలేసిన డ్రైవర్లపై కేసులు నమోదు చేయడంతో పాటు.. వారి వాహనాల ఇన్సూరెన్స్ లను కూడా సస్పెండ్ చేశారు. అయితే కెనడా వంటి పాశ్చాత్య దేశాల్లో ఎమర్జెన్సీ పేరు వినిపించడం ఇప్పుడు ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తుంది.

Also read: Lakhimpur Kheri: రైతులను హత్య చేసిన ఘటనలో నిందితుడికి బెయిల్