Lakhimpur Kheri: రైతులను హత్య చేసిన ఘటనలో నిందితుడికి బెయిల్

ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో గతేడాది అక్టోబర్ 3న జరిగిన రైతుల హత్య కేసు ఘటనలో ప్రధాన నిందితుడిగా చెప్పబడిన ఆశిష్ మిశ్రకి మరో 24 గంటల్లో బెయిల్ రానుంది.

Lakhimpur Kheri: రైతులను హత్య చేసిన ఘటనలో నిందితుడికి బెయిల్

Lakhim

Lakhimpur Kheri: ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో గతేడాది అక్టోబర్ 3న జరిగిన రైతుల హత్య కేసు ఘటనలో ప్రధాన నిందితుడిగా చెప్పబడిన ఆశిష్ మిశ్ర (కేంద్రమంత్రి అజయ్ మిశ్ర కుమారుడు)కి మరో 24 గంటల్లో బెయిల్ రానుంది. ఆశిష్ మిశ్ర బెయిల్ పై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు అందులో దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో బెయిల్ మంజూరు అయ్యే అవకాశం లభించింది. ఆశిష్ మిశ్రకు గత గురువారం హై కోర్ట్.. బెయిల్ మంజూరు చేయగా.. అందులో 302(హత్య), 120బీ(నేరసంబంధమైన కుట్ర) వంటి సెక్షన్లు ప్రస్తావించలేదు. దీంతో జైలు అధికారులు అతణ్ణి విడుదల చేయలేదు. సెక్షన్లు చేర్చకపోవడం “క్లరికల్ ఎర్రర్”(గుమస్తా చేసిన పొరబాటు)గా పేర్కొంటూ ఆశిష్ మిశ్ర హై కోర్టులోని లక్నో బెంచ్ ని ఆశ్రయించి.. వివరణ ఇచ్చుకున్నాడు.

Also read: Aman Pandey : లోపాలు పట్టాడు, రూ.65 కోట్లు సాధించాడు.. భారతీయ యువకుడి ఘనత

న్యాయస్థానం సెక్షన్ 302, 120బీలను కూడా పరిగణలోకి తీసుకుందని, అందువల్ల బెయిల్ ఆదేశాల్లో ఆయా సెక్షన్లను పొందుపరచాలని ఆశిష్ మిశ్ర హైకోర్టుకు చేసుకున్న దరఖాస్తుల్లో పేర్కొన్నాడు. తాజా ఉత్తర్వులు ఇప్పుడు లఖింపూర్ ఖేరీలోని జిల్లా మరియు సెషన్స్ జడ్జి కోర్టులో సమర్పించారు. దీంతో రెండు పూచీకత్తులతో పాటు రూ. 3 లక్షల విలువైన రెండు బెయిల్ బాండ్లను సమర్పించడంతో ఆశిష్‌ను విడుదల చేయాలని కోర్ట్ ఆదేశించింది.

Also read: YS Viveka : వైఎస్ వివేకా హత్య కేసు… సీబీఐ ఛార్జిషీటులో ఏముందంటే…

2021 అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరిలో నిరసన చేస్తున్న రైతులపైకి.. కారుతో దూసుకువెళ్లాడు ఆశిష్ మిశ్ర. ఆసమయంలో ఆశిష్ తో పాటు మరికొంతమంది కారులో ఉన్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడిక్కడే మృతి చెందగా, అనంతరం చెలరేగిన ఘర్షణల్లో మరో నలుగురు మృతి చెందారు. దీనిపై ఏర్పాటైన సిట్ బృందం.. ఇది పక్కా వ్యూహంతో, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యగా తేల్చారు. దీంతో ఆశిష్ మిశ్ర సహా మరో 12 మందిపై ఛార్జిషీట్ దాఖలైంది.

Also read: Five States Election 2022 : మూడు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల పోలింగ్