Anti-Conversion Law: మతమార్పిడిపై గుజరాత్ ప్రభుత్వ అప్పీల్ పై హైకోర్టుకు నోటీసు జారీచేసిన సుప్రీం కోర్ట్

తమార్పిడిపై గుజరాత్ ప్రభుత్వ అప్పీల్ పై హైకోర్టుకు నోటీసు జారీచేసిన సుప్రీం కోర్ట్.

Anti-Conversion Law: మతమార్పిడిపై గుజరాత్ ప్రభుత్వ అప్పీల్ పై హైకోర్టుకు నోటీసు జారీచేసిన సుప్రీం కోర్ట్

Gujarat

Anti-Conversion Law: గుజరాత్ మత స్వేచ్ఛ చట్టం, 2003 లోని సెక్షన్ 5 కార్యకలాపాలను నిలిపివేసిన హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం చేసిన అప్పీల్ పై సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. ఒక మతం నుండి మరొక మతానికి మారుతున్న వ్యక్తి.. జిల్లా మేజిస్ట్రేట్ అనుమతిని కోరాలని మతస్వేచ్ఛ విభాగం(సుప్రీం కోర్టులోని) తప్పనిసరి చేసింది. మతం మార్చబడిన వ్యక్తి ఆవిషయం గురించి మేజిస్ట్రేట్ కు తెలియజేయాలని కూడా సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్ పై న్యాయమూర్తులు ఎస్ అబ్దుల్ నజీర్, కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం నోటీసు జారీ చేసింది.

Also read: Lakhimpur Kheri: రైతులను హత్య చేసిన ఘటనలో నిందితుడికి బెయిల్

మత స్వేచ్ఛా చట్టం, 2003(సవరణ)పై గత ఏడాది ఆగస్టులో గుజరాత్ హైకోర్టు పలు సెక్షన్ల కార్యకలాపాలపై స్టే ఇచ్చింది, ఇందులో మతాంతర వివాహాలను బలవంతపు మార్పిడికి సాధనంగా పేర్కొన్న నిబంధన కూడా ఉంది. “ఒక వ్యక్తిని బలవంతంగా మరో మతంలోకి మార్చే ప్రాథమిక హక్కు ఎవరికీ లేదని” సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పునరుద్గాటించింది. “ఎందుకంటే ఒక వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా మరొక వ్యక్తిని తన మతానికి మార్చడానికి పూనుకున్నట్లయితే, అది మతప్రచారంగానూ, పరిగణించడంతో పాటు, ఎదుటి వ్యక్తి మత స్వేచ్చకు భంగం కలిగించినట్లు భావించాల్సి ఉంటుందని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Also read: YS Viveka : వైఎస్ వివేకా హత్య కేసు… సీబీఐ ఛార్జిషీటులో ఏముందంటే…

అయితే “చట్టంలోని సెక్షన్ 5(1) ప్రకారం, ఒక వ్యక్తిని ఒక మతం నుంచి మరో మతానికి మార్చడానికి ముందస్తు అనుమతి కోరడానికి సంబంధించిన నిబంధన… ఏ విధంగానూ ప్రాథమిక హక్కులను ప్రభావితం చేస్తుందని తాము బావించడంలేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఒరిస్సా ఫ్రీడమ్ ఆఫ్ రెలిజియన్ రూల్స్, 1989లో పేర్కొన్నవిధంగా మతమార్పిడికి కొన్ని ముందస్తు షరతులను సమర్థిస్తూ, సుప్రీం కోర్టు నిర్దేశించిన చట్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా గుజరాత్ హైకోర్టు తప్పుచేసిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.