Woman Murder : మద్యం మత్తులో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య

మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత ఆమె తలను నేలకు, గోడకేసి కొట్టి హతమార్చారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది.

Woman Murder : మద్యం మత్తులో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య

Woman

Updated On : September 23, 2021 / 1:21 PM IST

woman rape and murder : తెలంగాణలో దారుణం జరిగింది. సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన మరువకముందే మరో హత్యాచారం ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు.. రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత ఆమె తలను నేలకు, గోడకేసి కొట్టి దారుణంగా హతమార్చారు. ఆధారాలు దొరక్కుండా రక్తపు మరకలను శుభ్రంగా కడిగేశారు. మృతదేహాన్ని బయట ఓ రేకుల షెడ్​ కింద పడేశారు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లాలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది.

నల్గొండ జిల్లా ముషంపల్లికి ఓ దంపతులు ఇంటికి కొద్ది దూరంలో కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. 54 ఏళ్ల భార్య ఉదయం షాపుకు బయలుదేరి వెళ్తుండగా, అదే గ్రామానికి చెందిన బక్కతొట్ల లింగయ్య ఇంటి సమీపంలోకి చేరుకోగానే లింగయ్య, ఏర్పుజర్ల పుల్లయ్య కలిసి ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆ సమయంలో వారిద్దరూ బాగా తాగి ఉన్నారు. బయట వాన పడుతుండటం, ఆమె అరుపులు గట్టిగా లేకపోవడంతో బయట ఎవరికీ వినిపించలేదు.

Girl Raped : బస్సులో బాలికపై అత్యాచారం.. యూపీలో దారుణం

లింగయ్య, పుల్లయ్య ఆమెపై అత్యాచారం చేసి ఆ తర్వాత హతమార్చారు. మృతదేహాన్ని ఇంటి బయట రేకుల షెడ్‌లో పడేశారు. ఆ తర్వాత లింగయ్యను మృతదేహం దగ్గర ఉంచి పుల్లయ్య రోడ్డుపైకి వెళ్లాడు. స్కూలు దగ్గర ఆ మహిళ మరిది కనిపించడంతో దగ్గరికెళ్లి మీ వదిన రోడ్డుపై పడి ఉందని చెప్పాడు. అతను పరుగున వచ్చి చూడగా రక్తపు మడుగులో ఆమె కనిపించింది.

ఇంట్లోని వంట గది, బెడ్రూంలో గాజులు పడి ఉండటంతో పాటు రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులోనే ఇద్దరూ అత్యాచారం చేశారని చెప్పారు. భర్త భిక్షమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. నిందితులను గ్రామస్తులు చితకబాది పోలీసులకు అప్పగించారు.