Hyderabad : హైదరాబాద్ పాతబస్తీలో గ్యాంగ్‌వార్

హైదరాబాద్ పాతబస్తీలో రెండు గ్యాంగ్‌లు హాకీ స్టిక్స్, ఐరన్ రాడ్లతో హల్ చల్ చేసి హంగామా సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Hyderabad : హైదరాబాద్ పాతబస్తీలో గ్యాంగ్‌వార్

Hyderabad Gang War

Updated On : May 6, 2022 / 2:48 PM IST

Hyderabad : హైదరాబాద్ పాతబస్తీలో రెండు గ్యాంగ్‌లు హాకీ స్టిక్స్, ఐరన్ రాడ్లతో హల్ చల్ చేసి హంగామా సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సంతోష్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రియసత్ నగర్, ఫిసల్ బండాలోని మాయా గ్యాంగ్, సమీర్ గ్యాంగ్ రెండు గ్యాంగ్ లు, గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని రెండు గ్యాంగ్ లను చెదరగొట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా మిగిలిని నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Also Read : Chhattisgarh : చత్తీస్‌ఘడ్‌లో ఎన్ కౌంటర్-కొనసాగుతున్న కాల్పులు