జ్యోతి హత్య కేసు : నిందితుడు శ్రీనివాస్ హెల్త్ బులెటిన్ విడుదల

గుంటూరు: అంగడి జ్యోతి హత్య కేసు ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు పెద్ద మిస్టరీగా మారింది. అసలు జ్యోతి ఎలా చనిపోయింది, ఎవరు చంపారు.. అనే

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 09:58 AM IST
జ్యోతి హత్య కేసు : నిందితుడు శ్రీనివాస్ హెల్త్ బులెటిన్ విడుదల

గుంటూరు: అంగడి జ్యోతి హత్య కేసు ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు పెద్ద మిస్టరీగా మారింది. అసలు జ్యోతి ఎలా చనిపోయింది, ఎవరు చంపారు.. అనే

గుంటూరు: అంగడి జ్యోతి హత్య కేసు ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు పెద్ద మిస్టరీగా మారింది. 3 రోజులు గడుస్తున్నా.. అసలు జ్యోతి ఎలా చనిపోయింది, ఎవరు చంపారు.. అనే వివరాలేవీ తెలియదు. ఈ కేసులో ఎన్ఆర్ఐ వైద్యులు నిందితుడు శ్రీనివాస్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్రీనివాస్‌కు సృహతప్పి పడిపోవడం, మూర్చలాంటి లక్షణాలు ఉన్నాయని వైద్యులు చెప్పారు. అతడి తలపై బలమైన గాయాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని డాక్టర్లు చెప్పారు.

 

మంగళగిరి మండలంలోని నవులూరు అమరావతి టౌన్‌షిప్‌లో ఫిబ్రవరి 11వ తేదీ సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఘటనలో జ్యోతి చనిపోయింది. ఆమె మరణం మిస్టరీగా మారింది. జ్యోతి(23) ఎంఫార్మసీ చదివింది. శ్రీనివాసరావు(25) ఇంటర్‌ మాత్రమే చదివాడు. ఇద్దరు ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. రెండేళ్ల కిందట తల్లితండ్రులు లేని సమయంలో జ్యోతి ఇంటికి వచ్చిన శ్రీనివాసరావుని ఆమె సోదరుడు ప్రభాకర్‌ హెచ్చరించారు. మీ అబ్బాయిని జాగ్రత్తగా ఉంచుకోవాలని శ్రీనివాస్ తల్లిదండ్రులకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో శ్రీనివాసరావు కుటుంబసభ్యులు అక్కడ నుంచి నివాసం మార్చారు. ఇటీవల తిరిగి అక్కడికే మారి యువతితో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలసి 11వ తేదీ సోమవారం రాత్రి అమరావతి టౌన్‌షిప్‌లోకి చేరుకుని మాట్లాడుకుంటుండగా నలుగురు దుండగులు దాడి చేయడంతో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలపాలైన శ్రీనివాసరావు మండలంలోని చినకాకానిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 

జ్యోతి హత్య కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో నిజాలు దాచేందుకు పోలీసులు ప్రయత్నించారని జ్యోతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. తన చెల్లెల్ని అత్యాచారం చేసి హత్య చేశారని, ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేసినా పోలీసులు స్పందించడం లేదని జ్యోతి సోదరుడు ప్రభాకర్‌ వాపోయాడు. కేసును పక్కదారి పట్టించడానికి పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపించారు. పోస్టుమార్టం సైతం తూతూ మంత్రంగా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంగళగిరి సీఐ బాలాజీని సస్పెండ్‌కు సిఫార్సు చేయడంతోపాటు, ఎస్‌ఐ బాబూరావు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ అర్బన్‌ ఎస్పీ విజయారావు ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.