Haiti Gas Tanker Explosion : పేలిన హైతీ గ్యాస్ ట్యాంకర్.. 50 మంది సజీవదహనం!
గ్యాస్ ట్యాంకర్ పేలిన ఘటనలో కనీసం 50 మంది వరకు సజీవదహనమైనట్టు తెలుస్తోంది. ఈ ఘటన హైతీలోని క్యాప్ హైటియన్ నగరంలో మంగళవారం చోటుచేసుకుంది.

At Least 50 Killed In Haiti Gas Tanker Explosion
Haiti Gas Tanker Explosion : గ్యాస్ ట్యాంకర్ పేలిన ఘటనలో కనీసం 50 మంది వరకు సజీవదహనమైనట్టు తెలుస్తోంది. ఈ ఘటన హైతీలోని క్యాప్ హైటియన్ నగరంలో మంగళవారం (డిసెంబర్ 14) చోటుచేసుకుంది. పేలుడు కారణంగా సమీపంలోని చాలా ఇళ్లు కూడ మంటల్లో కాలిపోయినట్టు స్థానిక అధికారి ఒకరు వెల్లడించారు. ఇంట్లో ఉన్న వ్యక్తుల వివరాలు ఇంకా తెలియదన్నారు. పేలుడు ఘటనలో 50 మంది నుంచి 54 మంది వరకు సజీవదహనం కావడం తాను చూసినట్టు
నగర డిప్యూటీ మేయర్ పాట్రిక్ అల్మోనోర్ వెల్లడించారు. మంటల్లో కాలిపోయిన మృతులు ఎవరో గుర్తించడం కష్టమేనని ఆయన అన్నారు.
దాదాపు 20 ఇళ్లు వరకు మంటలు వ్యాపించడంతో దగ్ధమైపోయినట్టు చెప్పారు. ప్రస్తుతానికి మృతుల వివరాలను వెల్లడించలేమని తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని జస్టినియన్ యూనివర్శిటీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి బాధితులతో కిక్కిరిసిపోయింది. తీవ్రంగా కాలిపోయిన వ్యక్తులు అధిక సంఖ్యలో చేరడంతో వారికి చికిత్స అందించే సామర్థ్యం తమకు లేదని ఆస్పత్రిలోని నర్సు చెప్పినట్టు అధికారి పేర్కొన్నారు.
వారందరినీ రక్షించలేమని భయంగా అనిపిస్తుందని ఆమె చెప్పినట్టు నివేదిక తెలిపింది. గ్యాస్ పేలుడు ఘటనలో గాయపడ్డవారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొన్నిరోజులుగా హైతీలో ముఠాలు గ్యాస్‌లైన్లను స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర ఇంధన కొరత ఏర్పడుతోందని స్థానికులు అంటున్నారు.
Read Also : International Travellers : ఆ దేశాల నుంచే ప్రయాణికుల కోసం కొత్త గైడ్ లైన్స్