Crime News: 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. పక్కపక్క వీధుల్లోనే కాపురాలు.. ఎలా దొరికాడంటే!

పెద్ద కంపెనీ, డే అండ్ నైట్ డ్యూటీ అంటూ నమ్మించాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని.. ఇలా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. వారిలో ఏడుగురితో పక్కపక్క వీధుల్లోనే కాపురాలు పెట్టాడు. వారివద్ద దొరికినంతా దోచుకుంటూ జల్సాలు చేసుకుంటూ వచ్చాడు. మోసపోయామని తెలుసుకున్న ఇద్దరు భార్యలు నిత్యపెళ్లికొడుకు గుట్టురట్టు చేశారు..

Crime News: 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. పక్కపక్క వీధుల్లోనే కాపురాలు.. ఎలా దొరికాడంటే!

Cheater

Crime News: పెద్ద కంపెనీ, డే అండ్ నైట్ డ్యూటీ అంటూ నమ్మించాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని.. ఇలా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. వారిలో ఏడుగురితో పక్కపక్క వీధుల్లోనే కాపురాలు పెట్టాడు. వారివద్ద దొరికినంతా దోచుకుంటూ జల్సాలు చేసుకుంటూ వచ్చాడు. డబ్బులు ఏవని ప్రశ్నిస్తే క్లయింట్ వద్దకు వెళ్తున్నా వస్తాయంటూ వేరే భార్యవద్దకు వెళ్లేవాడు. ఇలా కొంతకాలం తరువాత ఓ భార్యకు అనుమానం రావడంతో అసలు ఏం చేస్తున్నాడని ఆరా తీయడం మొదలు పెట్టింది. అప్పుడు తెలిసింది.. నిత్యపెళ్లి కొడుకు బండారం.. ఖంగుతిన్న మహిళ తాము మోసపోయామని గుర్తించి అతగాడి మరో భార్యతో కలిసి నిత్యపెళ్లికొడుకు బండారాన్ని బయటపెట్టారు.

Lucky Man: అదృష్ట‌వంతులు.. రూ. 100 లాట‌రీ టికెట్‌కొని ల‌క్షాధికారుల‌య్యారు!

గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన అడపా శివశంకర్ బాబు వివాహ పరిచయ వేదిక ద్వారా పలువురు యువతలను పరిచయం చేసుకున్నాడు. వివాహమై విడాకులు తీసుకున్న యువతులే లక్ష్యంగా చేసుకొని ఒకరికి తెలియకుండా ఒకరిని ఇలా 11 మంది పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శివశంకర్ మాయమాటలకు మోసపోయిన వారిలో ఎక్కువ మంది విద్యావంతులే కావటం గమనార్హం. శివశంకర్ మాయమాటలకు మోసపోయిన వారిలో ఇద్దరు భార్యలు విలేకరుల సమావేశం పెట్టిమరీ అతగాడి గుట్టురట్టు చేశారు. తమకు పెద్ద కంపెనీ, డే అండ్ నైట్ ఉద్యోగం అంటూ నమ్మించి పెళ్లిచేసుకున్నాడని, కొంతకాలం తరువాత అవసరాలకోసం తమ వద్ద డబ్బులు తీసుకున్నాడని తెలిపారు. అవి ఏం చేశావంటూ నిలదీస్తే క్లయింట్ వద్దకు వెళ్తున్నా అంటూ వెళ్లిపోయేవాడని, ఆ తర్వాత కొద్దిరోజులు కనిపించేవాడు కాదని, ఫోన్ స్విచ్ఛాప్ వచ్చేదని మోసపోయిన బాధితులు తెలిపారు.

Mud Bath: అధికారులు బురదలో స్నానం చేస్తే వర్షాలు కురుస్తాయట.. పురాతన సంప్రదాయం

పెళ్లి పేరుతో మోసం చేశాడని, సుమారు రూ. 60లక్షలు వరకు నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చామని బాధితులు వాపోయారు. శివశంకర్ కు ఎలాంటి ఉద్యోగం లేదని, క్లయిట్ వద్దకు వెళ్తున్నానని చెప్పి మరో భార్య దగ్గరికి వెళ్లేవాడని వారు తెలిపారు. ఏడుగురు భార్యలతో మణికొండలోని పక్కపక్క వీధుల్లోనే కాపురాలు పెట్టాడని, ఒకరికి తెలియకుండా ఒకరితో కాపురం చేసేవాడని బాధిత మహిళలు తెలిపారు. ఏపీకి చెందిన ఓ మంత్రి బంధువునని శివశంకర్ చెప్పినట్లు వారు పేర్కొన్నారు. తాము మోసపోయినట్లు మరొకరు మోసపోవద్దనే తాము మీడియా ముందుకు వచ్చామని, తమను మోసం చేసి శివశంకర్ ను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.