Husband Chops Off : భార్యతో అక్రమ సంబంధం.. ప్రియుడి ముక్కు, చెవులు కోసేసిన భర్త

వివాహేతర సంబంధాలు మంచివి కాదని పోలీసులు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. పెళ్లయిన తర్వాత కూడా కొందరు పెడదోవ పడుతున్నారు.

Husband Chops Off : భార్యతో అక్రమ సంబంధం.. ప్రియుడి ముక్కు, చెవులు కోసేసిన భర్త

Husband Chops Off

Husband Chops Off : వివాహేతర సంబంధాలు మంచివి కాదని పోలీసులు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. పెళ్లయిన తర్వాత కూడా కొందరు పెడదోవ పడుతున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో దారుణాలు జరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్నాయి. పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ లో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికి భర్త తగిన శాస్తి చేశాడు. ఆ వ్యక్తి ముక్కు, చెవులు కోసేశాడు.

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో ఓ వ్యక్తి ముక్కు, చెవులు కోసేశాడో బర్త. పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రం ముజఫర్ గర్ లోని ఓ గ్రామానికి చెందిన మహమ్మద్ అక్రమ్ అనే వ్యక్తి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం మహిళ భర్త అబ్దుల్ ఖయూమ్ కి తెలిసింది. అతడు కోపంతో ఊగిపోయాడు. మాట్లాడాలని చెప్పి అక్రమ్ ను పిలిపించాడు. అతడిని నిర్మానుషమైన ప్రాంతానికి తీసుకెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో అక్రమ్ పై దాడి చేశాడు. అతడి ముక్కు, చెవులు అబ్దుల్ కోసేశాడు. ఈ దాడిలో అక్రమ్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఆ తర్వాత ఖయూమ్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు అక్రమ్ ను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కాగా, పాకిస్తాన్ లో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. ప్రతీ ఏటా అక్కడ పరువు హత్యలు నిత్యకృత్యం అయ్యాయి. వెయ్యి మందికిపైగా మహిళలు, దాదాపు 800మంది పురుషులు ప్రతి ఏటా పరువు హత్యకు గురవుతుంటారని నివేదికలు చెబుతున్నాయి.