Fraud Marriage : భార్యను చెల్లిగా పరిచయం చేసి పెళ్లి చేసిన భర్త..డబ్బు తీసుకుని ఉడాయించిన భార్య

ఈజీగా మనీ సంపాదించటానికి దంపతులు కొత్తప్లాన్ వేశారు. వెంటనే అమలు చేశారు. కట్టుకున్న భార్యనే చెల్లిగా పరిచయం చేస్తూ వేరే వ్యక్తికి ఇచ్చిపెళ్లి చేశాడు భర్త. పెళ్లైన మూడో రోజే ఆ ఇంట్లో ఉన్ననగదు,బంగారంతో భార్య ఉడాయించిన ఘటన రాజస్ధాన్‌లో చోటు చేసుకుంది.

Fraud Marriage : భార్యను చెల్లిగా పరిచయం చేసి పెళ్లి చేసిన భర్త..డబ్బు తీసుకుని ఉడాయించిన భార్య

Marriage Fraud

Fraud Marriage : ఈజీగా మనీ సంపాదించటానికి దంపతులు కొత్తప్లాన్ వేశారు. వెంటనే అమలు చేశారు. కట్టుకున్న భార్యనే చెల్లిగా పరిచయం చేస్తూ వేరే వ్యక్తికి ఇచ్చిపెళ్లి చేశాడు భర్త. పెళ్లైన మూడో రోజే ఆ ఇంట్లో ఉన్ననగదు,బంగారంతో భార్య ఉడాయించిన ఘటన రాజస్ధాన్‌లో చోటు చేసుకుంది.

కోట జిల్లా కునాడి పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే రవి అనే యువకుడు పెళ్లి చేసుకోటానికి దేవరాజ్ సుమన్ అనే మ్యారేజి బ్రోకర్‌ను సంప్రదించాడు.  తన ఫోటోలను ఇచ్చి మంచి సంబంధం చూసి పెట్టమన్నాడు. సుమన్ కొన్ని ఫోటోలు చూపించాడు. వాటిలో కోమల్ అనే యువతి రవికి నచ్చింది.

ఆమె వివరాలు అడగ్గా…. కోమల్‌కు తల్లితండ్రులు లేరని అన్నయ్య ఒక్కడే ఉన్నాడని చెప్పాడు. సరే కోమల్‌ను పెళ్లి చేసుకుంటానని వారిద్దరి మధ్య మీటింగ్ ఎరేంజ్ చేయమని చెప్పాడు. ఒక సుముహూర్తాన వారంతా హోటల్‌లో కలిశారు. కోమల్ వాళ్ల అన్నయ్య సోనూ కార్పరే, సుమన్, రవి హోటల్‌లో సమావేశం అయ్యారు. కోమల్‌ను చూసిన రవి, పెళ్లికి ఒప్పుకున్నాడు. తాము కట్నం ఇచ్చుకోలేమని కోమల్ అన్న సోనూ కార్పరే ముందే చెప్పుకొచ్చాడు. సరే అని రవి పెళ్లికి ఒప్పుకున్నాడు.

తక్కువ సమయంలో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఇద్దరి పెళ్లి ఒక గుళ్లో జరిపాడు సోనూకార్పరే. కోమల్ భర్తతో కాపురానికి వెళ్లింది. కోమల్ ఎక్కువ సేపు సోనూకార్పరేతో  ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. అన్నగారితోనే కదా మట్లాడుతోందని రవి ఏమీ అభ్యంతరం చెప్పలేదు. కాపురానికి వచ్చిన మూడో రోజే   కోమల్ కనిపించకుండా పోయింది. ఇంట్లో రెండు లక్షల రూపాయల నగదు, కొన్ని నగలు తీసుకుని ఉడాయించింది. షాక్‌కు గురైన రవి  కునాడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈక్రమంలో  మ్యారేజి బ్రోకర్ సుమన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట్లో తనకేమీ తెలియదని చెప్పినా పోలీసులు తమదైన స్టైల్లో విచారించే సరికి నిజం చెప్పాడు. ఇండోర్ కు చెందిన సోనూ కార్పరే, కోమల్ భార్యా భర్తలని… ఈజీ మనీ సంపాదించేందుకు ఈ మార్గం చెప్పారని… తనకు ఎక్కువ రిస్క్ లేకపోవటంతో ఈ సంబంధం కుదిర్చానని వెల్లడించాడు. సుమన్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు సోనూకార్పోరేను, కోమల్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.