దొంగలకు దొంగ : లైంగిక దాడులపై అవగాహన కల్పిస్తూ.. అడ్డంగా దొరికిన టీచర్

  • Published By: vamsi ,Published On : April 4, 2019 / 05:21 AM IST
దొంగలకు దొంగ : లైంగిక దాడులపై అవగాహన కల్పిస్తూ.. అడ్డంగా దొరికిన టీచర్

మహిళల భద్రత.. మన అందరి బాధ్యత అనే నినాదంతో హైదరాబాద్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలకు అనూహ్య స్పందన వస్తుంది. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు తిరుగుతూ.. అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్న షీ టీమ్స్.. ఘటకేసర్ మండలంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలు విద్యాసంస్థలలో విద్యార్ధినులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏది సేఫ్ టచ్.. ఏది చెడు ఉద్దశ్యంతో తాకిన టచ్.. అనే విషయాలను విద్యార్ధులకు వివరిస్తున్నారు. బాలబాలికలపై లైంగిక దాడులు గురించి వివరంగా పోలీసులు వారికి వివరాంచారు.

ఈ క్రమంలో అవగాహన కార్యక్రమం పూర్తయిన తర్వాత కొంతమంది విద్యార్ధినులు పోలీసుల వద్దకు వచ్చి ఒక టీచర్.. తమతో రెండేళ్లగా తప్పుగా ప్రవర్తిస్తున్నారంటూ ఫిర్యదు చేశారు. ఒకవేళ అతనని వ్యతిరేకిస్తే కొట్టేవాడని, బూతులు తిట్టేవాడని వారు పోలీసులకు వెల్లడించారు. దీంతో పోలీసులు అతనిని వెంటనే అరెస్ట్ చేశారు.

2013 నుండి అదే స్కూల్‌లో ఆరోపించబడిన వ్యక్తి పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతనిపై ఘటకేసర్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 354కింద, సెక్షన్ 8, సెక్షన్ 12 కింద కేసు నమోదు చేశారు. రాచకొండ పరిధిలో మహిళలకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా కూడా 9490617111కు లేదా 100కు వెంటనే కాల్ చేయాలని కోరారు.