Hyderabad : పుడింగ్‌ ఇన్‌ మింక్‌ పబ్‌ కేసులో ఆసక్తికర విషయాలు

సాధారణంగా ఒక్కగ్రాము కొకైన్‌ను నలుగురు నుంచి ఐదుగురు సేవించే అవకాశముందని తెలుస్తోంది. మొత్తం 50 గ్రాముల డ్రగ్స్‌ వినియోగించారంటే 250 మందికి సరిపడా మాదక ద్రవ్యాలు ముందే తెప్పించారా?

Hyderabad : పుడింగ్‌ ఇన్‌ మింక్‌ పబ్‌ కేసులో ఆసక్తికర విషయాలు

Radisson (1)

pudding in mink pub case : దొరికింది గ్రామంత.. వాడింది లెక్కతేలనంత.. పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో రైడ్‌ జరిగినప్పుడు దొరికింది నాలుగున్నర గ్రాముల కొకైన్‌ మాత్రమే. వాడిన డ్రగ్స్‌ 35 గ్రాములుగా తెలుస్తోంది. తనిఖీల సమయంలో సీజ్‌ చేయకుండా దాచిన డ్రగ్స్‌, కిటికీలు, బాత్‌రూమ్‌ల్లో పడేసిన మత్తు పదార్థాల లెక్కే తెలియదు. మొత్తంగా 50 గ్రాముల డ్రగ్స్‌ ఒక్క నైట్‌లోనే వాడేసినట్టు.. పీల్చేసినట్టు అర్ధం అవుతోంది.

సాధారణంగా ఒక్క గ్రాము కొకైన్‌ను నలుగురు నుంచి ఐదుగురు సేవించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం 50 గ్రాములు డ్రగ్స్‌ వినియోగించారంటే.. 250 మందికి సరిపడా మాదక ద్రవ్యాలు ముందే తెప్పించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక రైడింగ్‌ జరిగిన రోజు సిబ్బందితో సహా 145 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ లెక్కన పార్టీకి వెళ్లిన వారంతా కొకైన్‌ రుచి చూసినట్టేనా అనే సందేహాలు కలుగుతున్నాయి.

Drug Case : హైదరాబాద్ డ్రగ్ కేసులో కీలక నిందితుడు లక్ష్మీపతి అరెస్ట్

ఇక ఒక్క గ్రాము కొకైన్‌ ధర దాదాపు 10 నుంచి 20 వేల వరకు ఉంటుంది. క్వాలిటీని బట్టి అది మరింత పెరుగుతుంది. ఈ లెక్కన వన్‌ నైట్‌ పార్టీకి డ్రగ్స్‌ కోసమే దాదాపు పది లక్షలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. మరికొందరిని కూడా ఈ పార్టీకి ఆహ్వానించినట్టు అందుకే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ తెచ్చినట్టు సమాచారం. అయితే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి..? ప్రతి పార్టీలోనూ ఈ డ్రగ్స్ కామనేనా..? భారీగా డ్రగ్స్‌ తీసుకుంటున్నా.. పోలీసులు గుర్తించలేదా..? ఇవన్ని ప్రశ్నార్థకంగా ఉన్నాయి.