Ghaziabad: ఢిల్లీ మహిళ గ్యాంగ్ రేప్ కేసులో భారీ ట్విస్ట్.. అదంతా నాటకమట

వెంటనే పోలీసులు బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించడం, సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇంతలో వైద్యులు షాకింగ్ న్యూస్ చెప్పారు. బాధితురాలిగా చేరిన మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, అంతర్గతంగా ఎలాంటి గాయాలు కనిపించలేదని చెప్పారు

Ghaziabad: ఢిల్లీ మహిళ గ్యాంగ్ రేప్ కేసులో భారీ ట్విస్ట్.. అదంతా నాటకమట

Kidnap and gang-rape of Delhi woman fabricated

Ghaziabad: తాజాగా ఢిల్లీలో వెలుగు చూసిన సామూహిక అత్చాచారం కేసు గురించి దేశ వ్యాప్తంగా రెండు రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక పక్క పోలీసులు విచారణ ముమ్మరంగా సాగుతుండగా.. మరొక పక్క మహిళా కమిషన్ సహా అనేక సంఘాలు బాధితురాలికి బాసటగా నిలిచాయి. ఆమె చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, మెరుగైన వైద్యం అందించడంతో పాటు, సరైన న్యాయం చేయాలంటూ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఇంతలోనే ఈ కేసుకు సంబంధించి భారీ ట్వీస్ట్ బయటికి వచ్చింది. వాస్తవానికి సామూహిక అత్యాచారం ఏమీ జరగలేదట. ఆస్తి వివాదంలో కొందరిని ఇరికించే ఉద్దేశంతో బాధితురాలిగా చెప్పుకున్న మహిళ ఆడిన నాటకమని ఉత్తర ప్రదేశ్ పోలీసులు గుర్తించారు.

దీనికి ముందు జరిగిన తతంగంలో.. ఢిల్లీకి చెందిన 36 ఏళ్ల మహిళ ఈ నెల 16న ఉత్తర ప్రదేశ్‭లోని గజియాబాద్‭లో సోదరుడి పుట్టినరోజు వేడుకలకు హజరయింది. అయితే ఆస్తి విషయమై ఆమెపై కక్ష పెంచుకున్న ఐదుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల పాటు ఆమెను దారుణంగా హింసించిన అనంతరం ఒక గోనె సంచిలో ఆమెను చుట్టి గజియాబాద్ సమీపంలోని రహదారిపై పడేశారు. ఈ విషయమై మొదట వార్తలు ఇలా గుప్పుమన్నాయి.

Munugode By Poll : ఆపరేషన్ మునుగోడు : కమలానికి షాకులు మీద షాకులు.. టీఆర్ఎస్ లోకి క్యూ కడుతున్న బీజేపీ నేతలు

ఇంకేం.. వెంటనే పోలీసులు బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించడం, సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇంతలో వైద్యులు షాకింగ్ న్యూస్ చెప్పారు. బాధితురాలిగా చేరిన మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, అంతర్గతంగా ఎలాంటి గాయాలు కనిపించలేదని చెప్పారు. అంతే, కేసు ఒక్కసారిగా తిరగబడింది.

అయితే ఈ వివరాలు వెల్లడించకముందే ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ చేసిన ట్వీట్‭పై కొన్ని విమర్శలు వస్తున్నాయి. ‘‘ఇది నిర్భయ ఘటనను గుర్తు చేస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది’’ అని స్వాతి మాలివాల్ ట్వీట్ చేశారు. కానీ, ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలపడంతో ఆమె విధి నిర్వహణపై విమర్శలు చేస్తున్నారు నెటిజెన్లు.

ఇక జరిగిన తతంగాన్ని పోలీసులు వివరించారు. అత్యాచారం కేసులో నమోదు చేసిన వారిని ఉద్దేశ పూర్వకంగా ఇరికించే ప్రయత్నంలో భాగంగానే సదరు మహిళ ఈ నాటకం ఆడిందని, ఈ రెండు రోజులు తన స్నేహితుల వద్ద ఉందని తెలిపారు. ఈ కేసుకు ప్రచారం కల్పించే విధంగా డబ్బు చెల్లించిన సాక్ష్యాలను సైతం పోలీసులు గుర్తించారు. మరొక వైపు ఆసుపత్రి వెల్లడించిన రిపోర్టులు కూడా మహిళ ఆడిన నాటకాన్ని బయటపెట్టాయి.

Bharat Jodo Yatra In AP: ఏపీలో ముగిసిన భారత్ జోడో యాత్ర.. మద్దతుగా నిలిచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన రాహుల్