Lucknow: పేరెంట్స్-టీచర్ మీట్ ఏర్పాటు చేశారని తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

పేరెంట్స్-టీచర్ మీట్ ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. స్కూల్లో టీచర్లు ఒక విద్యార్థితో పేరెంట్స్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే, దీన్ని తప్పించుకునేందుకు అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

Lucknow: పేరెంట్స్-టీచర్ మీట్ ఏర్పాటు చేశారని తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Lucknow: పేరెంట్స్-టీచర్ మీట్ అంటే విద్యార్థులకు దడే. పిల్లలు చేసే తప్పుల్ని పేరెంట్స్‌కు టీచర్లు ఈ మీట్‌లో చెబుతారు. అందుకే చాలా మంది ఈ మీట్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. తాజాగా తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి పేరెంట్స్-టీచర్ మీట్ తప్పించుకునేందుకు ఏకంగా ఆత్మహత్యాయత్నం చేశాడు.

Elon Musk: ట్విట్టర్‌కు త్వరలో కొత్త సీఈవో.. పదవికి గుడ్ బై చెప్పనున్న ఎలన్ మస్క్

ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, లక్నో, గోమతి నగర్ ఎక్స్‌టెన్షన్ పరిధిలో జరిగింది. స్థానిక సీఎంఎస్ ప్రైవేట్ స్కూల్‌లో ఆదిత్యా తివారి అనే విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతడు ఎప్పుడూ బాగానే చదువుతాడు. అయితే, ఇటీవలి పరీక్షలో ఎందుకో మార్కులు తక్కువగా వచ్చాయి. దీంతో అతడి గురించి పేరెంట్స్‌కు చెప్పాలనుకున్నారు టీచర్స్. దీని కోసం పేరెంట్స్-టీచర్ మీట్ ఏర్పాటు చేసి, పేరెంట్స్‌ను రమ్మనమని చెప్పారు. అయితే, దీన్ని తప్పించేందుకు ఆదిత్య ప్రయత్నించారు. దీంతో పేరెంట్స్ ఇంటి దగ్గరే ఈ విషయం గురించి మాట్లాడాలనుకున్నారు టీచర్స్. ఎంత ప్రయత్నించినా పేరెంట్స్-టీచర్ మీట్ తప్పేలా లేకపోవడంతో బాగా భయపడిపోయాడు.

David Warner: రష్మిక మందన్నాకు సారీ చెప్పిన డేవిడ్ వార్నర్.. వైరల్ అవుతున్న ఆ వీడియో వల్లే

చివరకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు. ఈ క్రమంలో దగ్గర్లోని రైల్వే ట్రాక్‌పై గాయాలతో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆదిత్యను ఆస్పత్రికి చేర్చి, చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆదిత్య దగ్గర పోలీసులకు ఒక లెటర్ దొరికింది. అందులో తాను చేసిన పొరపాటుకు ఆదిత్య టీచర్‌కు సారీ చెప్పాడు.