Mumbai Man Kills Wife : పక్కింటోళ్ల మీద పోట్లాటకు రాలేదని భార్యను చంపిన భర్త

ఇంటి ముందు బట్టలు ఆరేస్తున్నారనే కారణంతో మొదలైన గొడవ.... ఓ ఇల్లాలి ప్రాణాలు తీసేంతవరకు వెళ్లిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

Mumbai Man Kills Wife : పక్కింటోళ్ల మీద పోట్లాటకు రాలేదని భార్యను చంపిన భర్త

Man Killed Wife

Mumbai Man Kills Wife :  ఇంటి ముందు బట్టలు ఆరేస్తున్నారనే కారణంతో మొదలైన గొడవ…. ఓ ఇల్లాలి ప్రాణాలు తీసేంతవరకు వెళ్లిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

ముంబైలోని తూర్పు విరార్ ప్రాంతంలో జగదీష్ అనే వ్యక్తి భార్య సుప్రియ గౌరవ్ తో నివాసం ఉంటున్నాడు. జగదీష్ వాసాయి రైల్వే స్టేషన్ బయట రైలు టికెట్లు విక్రయించే ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.

అదే ప్రాంతంలోని నరేంద్ర బ్రహ్మ కాంప్లెక్స్ లోని జగదీష్ అత్తగారు సుప్రియ, తల్లి సుష్మా శెట్టి(47) కూడా నివసిస్తోంది. ఆదివారం రాత్రి జగదీష్ కు చెందిన ఫ్లాట్ వద్ద రాత్రి 9 గంటలకు ఒక సంఘటన జరిగింది. జగదీష్ ఇంటి బయట వేరే వారు బట్టలు ఆరేసుకుంటున్నారు. అందుకు జగదీష్ అభ్యంతరం చెప్పాడు. అయినా వారు వినకుండా అక్కడే బట్టలు ఆరేసుకోవటంప్రారంభించారు.

దీంతో అతను వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో అత్తగారింట్లో ఉన్న తన భార్య సుప్రియ(28)ను పక్కింటోళ్లతో పోట్లాడటానికి రమ్మని ఫోన్ చేసి పిలిచాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఇప్పడు పనిలో ఉన్నాను. రాలేనని చెప్పింది. జగదీష్ వెంటనే నరేంద్ర బ్రహ్మ కాంప్లెక్స్ లోని తన అత్తగారి ప్లాట్ వద్దకు వచ్చాడు. భార్యతో గొడవకు దిగాడు. కోపంతో భార్యా, అత్తగారిపై దాడికి దిగాడు.

ఇద్దరిని ఇష్టం వచ్చినట్లు కొట్టటం ప్రారంభించాడు, అత్త సుష్మా శెట్టి అల్లుడు జగదీష్ ను బలంగా తోసివేసింది. కిందపడిన జగదీష్ అక్కడే ఉన్న కూరలు కోసుకునే కత్తితో భార్యపై దాడి చేశాడు. ఆమె గుండెల్లో కత్తితోవిచక్షణా రహితంగా పొడిచాడు. అడ్డుపడిన అత్తగారిపైనా దాడి చేశాడు. ఈదాడిలో భార్య సుప్రియ తీవ్రంగా గాయపడగా… అత్త సుష్మ‌కు గాయాలయ్యాయి.
Also Read : Woman Shower Filming : మహిళా పోలీసు అధికారి బాత్రూం వీడియో…రూ. 5 లక్షలకు బేరం పెట్టిన డ్రైవర్
వీరింట్లో గొడవ చూసిన ఇరుగుపొరుగువారు అక్కడకు వచ్చే సరిక జగదీష్ పరారయ్యాడు. స్ధానికులు గాయపడిన తల్లీ కూతుళ్లను సమీపంలోని సిధ్దివినాయక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కూతురు సుప్రియను సంజీవని ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు. అక్కడకు తీసుకువెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.