Dating App Love : డేటింగ్‌ యాప్‌లో పరిచయం…రూ.18 లక్షలు దోచేసిన ప్రియుడు

వరెన్ని రకాలుగా జాగ్రత్తలు చెపుతున్నా మోసగాళ్ల చేతిలో  అమాయకులు బలి అవుతూనే ఉన్నారు. మొబైల్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన మోసగాడు ఒక మహిళ నుంచి రూ.18.29 లక్షలు కాజేశాడు.

Dating App Love : డేటింగ్‌ యాప్‌లో పరిచయం…రూ.18 లక్షలు దోచేసిన ప్రియుడు

Dating App Cheating

Dating App Love : ఎవరెన్ని రకాలుగా జాగ్రత్తలు చెపుతున్నా మోసగాళ్ల చేతిలో  అమాయకులు బలి అవుతూనే ఉన్నారు. మొబైల్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన మోసగాడు ఒక మహిళ నుంచి రూ.18.29 లక్షలు కాజేశాడు.

కర్ణాటక రాజధాని బెంగుళూరులోని ఆస్టిన్ టౌన్ లో నివసించే 37 ఏళ్ల మహిళ డేటింగ్ యాప్ లో తన ప్రోఫైల్ క్రియేట్  చేసుకుంది. అందులో ఆమెకు   ఒక  వ్యక్తితో పరిచయం ఏర్పడింది.  ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తాను విదేశాల్లో స్ధిరపడ్డానని చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి.  ఫోన్ లో మాట్లాడుకోవటం మొదలెట్టారు. వాట్సప్ లో చాటింగ్ చేసుకున్నారు.  ఇద్దరూ తమ తమ ఫోటోలు మార్పుడి చేసుకున్నారు.

Also Read : Sanitary Pads Stolen : ప్రేయసి కోసం శానిటరీ ప్యాడ్‌లు దొంగతనం చేసిన ప్రియుడు

ఒకరంటే ఒకరికి ప్రేమ పుట్టింది. ప్రేమ లోకంలో విహారించారు. చాటింగ్ లో మునిగి తేలారు. ఈ క్రమంలో ఆమె ఆర్ధిక పరిస్ధితి తెలుసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించింది. ఆనందలోకాల్లో విహరించింది. ఒకనాడు ఉన్నట్టుండి కాస్త డబ్బు సర్దుబాటు చేయాలని కోరాడు. మరోసారి ఇంకో కారణం చెప్పి డబ్బు తీసుకున్నాడు.

Also Read : Chigurupati Jayaram : NRI చిగురుపాటి జయరాం హత్య కేసు-పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి బెదిరింపులు

అనుకోకుండా ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పి ఆమె వద్ద నుంచి మరికొంత నగదు తన ఖాతాకు జమ చేయించుకున్నాడు. ఈ రకంగా దాదాపు రూ. 18.29 లక్షలు జమ చేయించుకున్నాడు. ఒక రోజు ఉన్నట్టుండి డేటింగ్ యాప్ నుంచి తన ప్రోఫైల్ డిలీట్ చేసి ఫోన్ స్విఛ్చాఫ్ చేసుకున్నాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.