నిందితుడిని పట్టించిన ఫేస్ బుక్, ఏడాది తర్వాత అమ్మాయి మర్డర్ కేసుని చేధించిన పోలీసులు

  • Published By: naveen ,Published On : June 4, 2020 / 09:57 AM IST
నిందితుడిని పట్టించిన ఫేస్ బుక్, ఏడాది తర్వాత అమ్మాయి మర్డర్ కేసుని చేధించిన పోలీసులు

ఏడాది కాలంగా మిస్టరీగా మారిన మర్డర్ కేసుని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. అమ్మాయి హత్య కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. దీనికి కారణం ఫేస్ బుక్. అవును, హంతకుడిని ఫేస్ బుక్ పట్టించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. మీరట్ లో ఏడాది క్రితం 19ఏళ్ల అమ్మాయి మృతదేహం కనిపించింది. అమ్మాయిని హత్య చేసి మృతదేహాన్ని పొలాల్లో పడేశారు. కేసు నమోదు చేసుకున్న మీరట్ పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఈ మర్డర్ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ఎందుకంటే ఒక్క క్లూ కూడా లేదు. శరీరం నుంచి తల వేరు చేసి ఉంది. ఎవరూ గుర్తు పట్టకుండా ముఖాన్ని చెక్కేశారు. 

ఒక్క క్లూ కూడా లేదు:
కాగా చేతిపై రెండు పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి ఏక్తా జస్వాల్. అంటే ఆ అమ్మాయి పేరు అన్నమాట. మరో పేరు ఉంది. కానీ అది చెరిపేసి ఉంది. దీంతో పోలీసులకు ఈ కేసు చాలెంజ్ గా మారింది. ఆ అమ్మాయిది ఏ ఊరు? ఎక్కడ ఉంటుంది? ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఇలాంటి వివరాలేవీ తెలీదు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు మర్డర్ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు. డెడ్ బాడీ పడి ఉన్న ప్రాంతంలో ఆ రోజున అక్కడ పని చేసిన సెల్ ఫోన్ నెంబర్లను ట్రేస్ చేశారు. దాని ఆధారంగా పోలీసులకు చిన్న క్లూ దొరికింది. ఓ నెంబర్ లూథియానా ప్రాంతం నుంచి రిజిస్టర్ అయ్యింది. దీంతో ప్రత్యేక పోలీసు బృందం లూథియానా బయలుదేరింది. 

2019 మే లో అమ్మాయి మిస్సింగ్ కేసు నమోదు:
స్థానికంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు స్పెషల్ టీమ్ వెళ్లింది. అమ్మాయిల మిస్సింగ్ కేసులు గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో తమ అమ్మాయి కనిపించడం లేదంటూ ఓ వ్యక్తి 2019 మే నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న మీరట్ పోలీసులు ఫిర్యాదు చేసిన వారిని వెంటనే కలుసుకున్నారు. తమ అమ్మాయి కనిపించడం లేదని వారు పోలీసులతో చెప్పారు. అయితే తమ అమ్మాయి ఇంకా బతికే ఉందన్నారు. దీంతో పోలీసులకు ఎక్కడో అనుమానం వచ్చింది. అంత కచ్చితంగా ఎలా చెబుతున్నారని పోలీసులు వారిని అడిగారు. దీంతో వారు ఫేస్ బుక్ చూపించారు. చూడండి, ఇందులో మా అమ్మాయి తరుచుగా తన ఫొటోలు అప్ లోడ్ చేస్తోంది, దీని ఆధారంగానే ఆమె బతికే ఉందని మేము నమ్మకంగా చెబుతున్నామని వివరించారు. 

ఏక్తా అకౌంట్ నుంచి ఫొటోలు అప్ లోడ్ చేస్తున్న అమన్:
అంతే పోలీసులకు బిగ్ క్లూ లభించింది. వెంటనే ఆ అకౌంట్ గురించి ఆరా తీశారు. దీంతో హంతకుడు దొరికాడు. వాస్తవానికి ఏక్తా ఖాతా నుంచి ఆ ఫొటోలు అప్ లోడ్ చేస్తున్నది ఏక్తా కాదు అమన్. ఏక్తా లవరే అమన్. వెంటనే పోలీసులు అమన్ కోసం గాలించారు. ఎక్కడ ఉన్నాడో కనిపెట్టారు. అతడి కోసం వెళ్లారు. పోలీసులను చూడగానే అమన్ భయపడ్డాడు. పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు గన్ తో అతడి కాలిపై కాల్చారు. బుల్లెట్ గాయం కావడంతో అమన్ దొరికిపోయాడు. అమన్ అసలు పేరు మహమ్మాద్ సాకిబ్. ఏక్తాను హత్య చేసింది తానే అని పోలీసుల విచారణలో సాకిబ్ ఒప్పుకున్నాడు. ప్రేమ పేరుతో ఏక్తాను ట్రాప్ చేశానని, మోజు తీరాక మర్డర్ చేశానని చెప్పాడు. 2009లో ఏక్తాకి సాకిబ్ కు పరిచయం అయ్యాడు. లూథియానాలో ఏక్తా ఈవెంట్ మేనేజర్ గా పని చేసేది. ఆమె అసిస్టెంట్ గా సాకిబ్ పని చేసేవాడు. తనను అమన్ గా ఏక్తాకి పరిచయం అయ్యాడు సాకిబ్. ఏం జరిగిందో కానీ, 2019 జూన్ 13న పొలాల్లో ఏక్తా మృతదేహం కనిపించింది. కుక్కులు మృతదేహాన్ని పీక్కుని తింటుండగా ఓ రైతు చూశాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అలా సోషల్ మీడియా ఆధారంగా ఏడాది తర్వాత మర్డర్ కేసుని చేధించగలిగారు పోలీసులు.

Read: చెల్లెలిపై అత్యాచారం చేసిన భర్తను చంపి ఇంటి వెనుక పాతి పెట్టేసిన భార్య