Nalgonda Murder : ఆర్ధిక లావాదేవీల కారణంగా స్నేహితుడు హత్య.. పోలీసుల అదుపులో నిందితుడు ?

నల్గోండ జిల్లాలో ఐదురోజులుగా కనిపించకుండా పోయిన రాజశేఖర్ అనే వ్యక్తి హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఆర్ధిక లావాదేవీల కారణంగా స్నేహితుడే హత్యచేసి పోలీసులుకు లొంగి పోయినట్లు సమాచారం. 

Nalgonda Murder : ఆర్ధిక లావాదేవీల కారణంగా స్నేహితుడు హత్య.. పోలీసుల అదుపులో నిందితుడు ?

nalgonda murder

Nalgonda Murder :  నల్గోండ జిల్లాలో ఐదురోజులుగా కనిపించకుండా పోయిన రాజశేఖర్ అనే వ్యక్తి హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఆర్ధిక లావాదేవీల కారణంగా స్నేహితుడే హత్యచేసి పోలీసులుకు లొంగి పోయినట్లు సమాచారం.  వివరాల్లోకి వెళితే….నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామం రసూల్‌గూడెంలో ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన రాజశేఖర్ అనే యువకుడు హత్యకు గురైనట్లు వార్తలు ఈరోజు ఒక్కసారిగా గ్రామంలో కలకలం రేపాయి.

తన తమ్ముడు రాజశేఖర్ కనపడటంలేదని అతని అన్న నరసింహా మే31వ తేదీన కట్టంగూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాజశేఖర్ వాడుతున్న మొబైల్ సిగ్నల్ ఆధారంగా రసూల్ గూడెం నుండి నల్గొండకి వెళ్లినట్లుగా   చూపించడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు నల్గొండ పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయినప్పటికీ రాజశేఖర్ ఆచూకీ దొరకలేదు.  పోలీసులు హైవే పైన ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈక్రమంలో నల్గొండ నుండి తాటికల్లు వచ్చే మార్గంలో చందంపల్లి గ్రామ శివారులో మృతుడు రాజశేఖర్ బైక్, చెప్పులు, పురుగుల మందు డబ్బా కనుగొన్నారు. రాజశేఖర్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అనే కోణంలో పోలీసులు సమీపంలోని పానగల్ చెరువులో గజ ఈతగాళ్లు సహాయంతో వెతికించారు. అయినప్పటికీ మృతదేహం లభ్యం కాలేదు.

ఇలా ఉండగా  రామచంద్రపల్లెకు చెందిన వెంకన్న అనే యువకుడు  తన స్నేహితుడైన రాజశేఖర్‌ను హత్య చేసినట్లుగా ఒప్పుకుని  శుక్రవారం  నల్గొండ ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో రాజశేఖర్ మిస్సింగ్, సూసైడ్ కేసును పోలీసులు హత్యకేసుగా మార్చినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రాజశేఖర్‌ని అతని స్నేహితుడు వెంకన్న హత్యచేశాడని పోలీసులు కుటుంబ సభ్యులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.

వెంకన్న, రాజశేఖర్ ను కేవలం ఆర్థిక లావాదేవీల విషయంలో మాట,మాట పెరిగి హత్య చేసినట్లుగా ఒప్పుకున్నట్లు అనధికార సమాచారం.  వెంకన్నతన పొలం వద్ద ఉన్న తాటి ముంజల బస్తా తీసుకు రావటానికి సహయం రమ్మని చెప్పి రాజశేఖర్‌ను తీసుకుని అతని బైక్ పై మే 31వ తేదీ ఉదయం 10 గంటలకు రామచంద్రపల్లి శివారులో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తీసుకు వెళ్లాడు. అక్కడ రాజశేఖర్, వెంకన్నల మధ్య ఆర్ధిక లావాదేవీలకు సంబందించి వాగ్వాదం జరిగినట్లు వెంకన్న చెప్పాడు.

అనంతరం రాజశేఖర్ ఫోన్ మాట్లాడుతుండగా వెంకన్న తన వద్ద ఉన్నతాటి ముంజలు కోసే కత్తితో వెనుక నుంచి మెడనరికి హత్య చేసినట్లు చెప్పాడు. అనంతరం మృతదేహాన్ని వెంకన్న వ్యవసాయం పొలం సమీపంలోని వాగు వద్ద పాతిపెట్టాడు. గ్రామస్తులను, రాజశేఖర్ కుటుంబ సభ్యులను నమ్మించడానికి రాజశేఖర్ బైక్, సెల్ ఫోన్, చెప్పులు, నల్గొండ సమీపంలో ఉన్న పానగల్లు ప్రాజెక్టు వద్ద వదిలేశాడు వెంకన్న. పోలీసుల అదుపులో ఉన్న వెంకన్నను విచారిస్తే మరిన్ని నిజాలు తెలుస్తాయి. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఈ రోజు పోలీసులు రాజశేఖర్ మృతదేహాన్ని వెలికి తీయనున్నారు.

Also Read : Biryani : బిర్యానీ రుచిగా లేదని హోటల్ సిబ్బందిపై దాడి