క్షణికావేశం : సిగరేట్ వెలిగించలేదని..అల్లుడిని కత్తితో పొడిచిన మేనమామ

10TV Telugu News

క్షణికావేశం జీవితాన్ని చిదిమేస్తుంది. ఆ సమయంలో ఏమి చేస్తున్నారో అర్థం కాక కుటుంబసభ్యుల ప్రాణాలను తీసేస్తున్నారు. లేదంటే..తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. కేవలం ఈ క్షణికావేశం వల్లే..ఎంతో మంది జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. కేవలం సిగరేట్ వెలిగించలేదనే కారణంతో..అల్లుడిని కత్తితో పొడిచాడు మేనమామ. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

తమిళనాడులోని రామనాథపురం జిల్లా..బజనైకోవిల్ వీధిలో మణికిందన్ (43) నివాసం ఉంటున్నాడు. ఇతను కారు డ్రైవర్. ఇతని సోదరి సమీపంలో ఉండే ఇరుగూరు మార్కెట్ రోడ్డులో నివాసం ఉంటోంది. ఇటేవలే కృష్ణమణి కొడుకు యోగేష్ (15) మేనమామ మణికందన్ ఇంటికి వచ్చాడు. కొద్ది రోజులుగా ఇక్కడే ఉంటున్నాడు. యోగేష్ ని మణికందన్ పిలిచాడు. సిగరేట్ వెలిగించాలని కోరాడు. యోగేష్ వెలగించనని ఖరాఖండిగా చెప్పాడు.

తీవ్ర ఆగ్రహానికి గురైన మణికందన్..కత్తి తీసుకుని యోగేష్ కడుపులో పొడిచాడు. తీవ్రగాయాలై..అక్కడికక్కడనే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు కోయంబత్తూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యోగేష్ పరిస్థితి నిలకడగానే ఉందని.. వైద్యులు తెలిపారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు..పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మణికందన్ ను పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Read: వివాహితతో అక్రమ సంబంధం….దారుణ హత్య