Murder Attack : కర్ణాటకలో చర్చి ఫాదర్ పై హత్యాయత్నం

శీతాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు బెళగావిలో చర్చి ఫాదర్ పై ఒక అపరిచిత వ్యక్తి  హత్యాయత్నం చేయటం కలకలం రేపింది.

Murder Attack : కర్ణాటకలో చర్చి ఫాదర్ పై హత్యాయత్నం

Attempt Murder On Charch Father

Updated On : December 12, 2021 / 7:44 PM IST

Murder Attack : కర్ణాటక  అసెంబ్లీ శీతాకాల సమవేశాలు రేపటి నుంచి  బెళగావిలో ప్రారంభంకానున్నాయి. ప్రతిపక్షాలు, క్రైస్తవ సంఘాలు వ్యతిరేకిస్తున్న మత మార్పిడి వ్యతిరేక బిల్లును అధికార బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. శీతాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు బెళగావిలో చర్చి ఫాదర్ పై ఒక అపరిచిత వ్యక్తి  హత్యాయత్నం చేయటం కలకలం రేపింది.

బెళగావిలోని బాక్సైట్ రోడ్డులోని చర్చిలోకి   శనివారం మధ్యాహ్నం ఒక వ్యక్తి   పొడవాటి కత్తి,  వైరు తీసుకుని ప్రవేశించాడు. లోపలకు వచ్చిరాగానే చర్చి ఇంచార్జ్ అయిన ఫ్రాన్సిస్ డిసౌజా వెంట పడ్డాడు.

దీంతో ఆయన ప్రాణాలు రక్షించుకోటానికి  పరుగెత్తి  మెట్లు దిగి కిందకు  వెళ్ళాడు.  చర్చి ఫాదర్ పరిగెత్తుకుంటూ   రావటం చూసిన కొందరు   ఆయన వద్దకు రాసాగారు. ఫాదర్ వద్ద ఎక్కువ మంది మనుషులు  రావటం చూసిన వ్యక్తి అక్కడి  నుంచి పారిపోయాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీ లో రికార్డైంది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు చర్చి   వద్ద   భద్రతను పెంచారు.