Chhattisgarh: కనిపించకుండాపోయిన ఆర్టీఐ కార్యకర్త హత్య.. నిందితుల అరెస్టు.. అత్యుత్సాహంతో దొరికిపోయిన సర్పంచ్

గత నెలలో కనిపించకుండా పోయిన ఆర్టీఐ కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 12న జరిగింది. త నెల 12న అతడు చివరిసారి తన ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత నుంచి కనిపించలేదు.

Chhattisgarh: కనిపించకుండాపోయిన ఆర్టీఐ కార్యకర్త హత్య.. నిందితుల అరెస్టు.. అత్యుత్సాహంతో దొరికిపోయిన సర్పంచ్

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో గత నెలలో కనిపించకుండా పోయిన ఆర్టీఐ కార్యకర్త హత్యకు గురయ్యాడు. కాలిపోయిన అతడి అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్, కబిర్‌దమ్ జిల్లాలో గత నెలలో జరిగింది. వివేక్ చౌబే అనే వ్యక్తి జర్నలిస్టుగా పనిచేస్తూనే, ఆర్టీఐ కార్యకర్తగా ఉండేవాడు.

United States: అమెరికాలో మంచు తుపాన్ ధాటికి 18 మంది మృతి.. కరెంటు లేక చీకట్లోనే 17 లక్షల మంది

గత నెల 12న అతడు చివరిసారి తన ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత నుంచి కనిపించలేదు. దీంతో నవంబర్ 16న అతడు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని, విచారణ జరిపారు. అతడు చివరిసారిగా కుందాపాని గ్రామంలో కనిపించినట్లు తెలుసుకుని పోలీసులు ఆ గ్రామం చుట్టుపక్కల వెతికారు. కానీ, ఎక్కడా కనిపించలేదు. ఈ క్రమంలో వివేక్ ఆచూకీ చెబితే నగదు బహుమతి కూడా ఇస్తామని చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసులు ప్రకటించారు. అయితే, ఆశ్చర్యంగా అతడు చివరిసారిగా కనిపించిన గ్రామానికి దగ్గర్లో ఉన్న బొక్కార్కార్ అనే మరో గ్రామ సర్పంచ్ కూడా నగదు బహుమతి ఇస్తానని చెప్పాడు. ఈ విషయమే పోలీసులకు అనుమానం కలిగేలా చేసింది. ఇదే సమయంలో ఒక కాలిన అస్థిపంజరాన్ని అడవిలో గుర్తించారు. దీన్ని సేకరించి పరీక్షలు నిర్వహించగా, అది వివేక్ చౌబేది అని తేలింది.

Lionel Messi: మెస్సీకి బంపర్ ఆఫర్.. ‘వరల్డ్ కప్ బిష్ట్’ ఇస్తే రూ.8 కోట్లు ఇస్తానన్న ఒమన్ ఎంపీ

మరోవైపు వివేక్ ఆచూకీ చెబితే నగదు బహుమతి ఇస్తానని ప్రకటించిన సర్పంచ్‌పై అనుమానంతో పోలీసులు అతడ్ని విచారించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా తనే వివేక్ చౌబేను హత్య చేసినట్లు సర్పంచ్ అంగీకరించాడు. నవంబర్ 12న వివేక్ తన దగ్గరే ఉన్నాడని, అయితే, ఒక విషయంలో గొడవ జరగడంతో అతడ్ని చంపేసినట్లు చెప్పాడు. అనంతరం మరో ముగ్గురితో కలిసి మృతదేహాన్ని అడవిలోకి తీసుకెళ్లి కాల్చేశానన్నాడు. తర్వాత అతడి బైకును మూడు పార్టులుగా విడదీసి, వేర్వేరు చోట్ల పాతిపెట్టినట్లు వెల్లడించాడు. పోలీసులు బైకును స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యలో సర్పంచ్‌కు సహకరించిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.