Property Dispute : ఆస్తి కోసం తల్లిని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళిన మున్సిపల్ చైర్మన్

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది.

Property Dispute : ఆస్తి కోసం తల్లిని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళిన మున్సిపల్ చైర్మన్

Yemmiganur

Property Dispute : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆస్తికోసం కన్నతల్లిని   రోడ్డుమీద ఈడ్చుకుంటూ తీసుకువెళ్లాడు ఒక ప్రజాప్రతినిధి. ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ రఘు, అతని తల్లి తండ్రులకు ఆస్తుల విషయంలో వివాదం జరుగుతోంది.

చైర్మన్  రఘు తల్లి సరోజ వైసీపీ తరుఫున 25వ వార్డు కౌన్సెలర్ గా పని చేస్తున్నారు.  గత 3నెలలుగా తన కుమారుడు రఘు ఆస్తికోసం వేధిస్తున్నాడని సరోజ  పోలీసులకు  ఫిర్యాదు చేశారు. ఇంటి కొచ్చి తల్లి తండ్రులపై, కుటుంబ సభ్యులపై దాడి చేస్తున్నాడని ఆమె జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నారు.

Also Read : Real Estate Dispute : విశాఖలో రియల్ ఎస్టేట్ వివాదం-మహిళకు బెదిరింపులు

ఈరోజు ఆస్తి విషయంలో జరిగిన ఘర్షణలో  రఘు తన  తల్లిని రోడ్డుమీద ఈడ్చుకుంటూ తీసుకువెళ్లాడు. దీంతో బాధితురాలు ఈ రోజు కుమారుడు రఘు మీద జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కుమారుడి వ్లల తమకు ప్రాణభయం పట్టకుందని….తమకు రక్షణ కల్పించాలని ఆమె జిల్లా ఎస్పీని వేడుకుంది. కొడుకు మున్సిపల్ చైర్మన్ కావటంతో పోలీసులు తమ గోడు పట్టించుకోవటంలేదని ఆ ఫిర్యాదులో ఆమె వివరించింది.

కాగా…. తన తల్లి  పోలీసులకు చేసిన ఫిర్యాదుపై మున్సిపల్ చైర్మన్ రఘు స్పందించారు… నా తల్లిదండ్రులు నా కుటుంబం నా పైన తప్పుడు కేసులు పెట్టారని… నేను చేసింది ధర్మమో.. ఆధర్మమో పైన భగవంతుడు చూసుకుంటాడని ఆయన వ్యాఖ్యానించారు.  నేను మా అమ్మని కొట్టలేదని.. మా వాళ్ళే  నా పై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు.  నా వాళ్లే నా పరువు తీశారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని రఘు చెప్పారు.