Harini Father : సింగర్‌ హరిణి తండ్రి మృతి కేసులో కొత్త ట్విస్ట్.. శరీరంపై కత్తిపోట్లు

సింగర్ హరిణి తండ్రి ఏకే రావు మృతి కేసు కొత్త టర్న్ తీసుకుంది.. ఏకే రావు మృతిని హత్యకేసుగా నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. ఆయన శరీరంపై కత్తి గాయాలను గుర్తించారు.

Harini Father : సింగర్‌ హరిణి తండ్రి మృతి కేసులో కొత్త ట్విస్ట్.. శరీరంపై కత్తిపోట్లు

Ak Rao

Singer Harini’s Father : సింగర్ హరిణి తండ్రి ఏకే రావు మృతి కేసు కొత్త టర్న్ తీసుకుంది.. ఏకే రావు మృతిని హత్య కేసుగా నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. ఆయన శరీరంపై కత్తి గాయాలను గుర్తించారు. మరోవైపు ఏకే రావుది ముమ్మాటికి హత్యే అని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఏకే రావు మణికట్టు, గొంతుపై కత్తితో కోసిన గుర్తులు ఉన్నాయని చెబుతున్నారు.. పోస్టుమార్టమ్‌ అనంతరం బెంగళూరులోనే ఏకే రావుకు అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఏకే రావు కేసులో ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు బయటికి వచ్చాయి.

Read More : Kim Jong Un : ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి దారుణ శిక్ష విధించిన కిమ్ జోంగ్

ఈ నెల 23న యలహంక – రాజనాకుంటు రైల్వే స్టేషన్ మధ్య ఏకే రావు మృత దేహం గుర్తించామని.. నాందేడ్ ఎక్స్ ప్రెస్ కో పైలెట్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. తలపై ఆరు సెంటిమీటర్ల గాయం, ఎడమ చేతిపై, గొంతుపై గాయాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఘటన స్థలంలో చాకు, కత్తి, బ్లెడ్‌ లను స్వాధీనం చేసుకున్నామని, మృతుడి దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామమని… ఏకే రావు కుటుంబ సభ్యులు మృత దేహాన్ని చూసి నిర్ధారించారన్నారు. ఈ నెల 8న బెంగళూరుకు వచ్చిన ఏకే రావు తన కొడుకు ఇంట్లో ఉన్నాడని పోలీసు విచారణలో తెలిందని తెలిపారు.

Read More : Karnataka KGF : పాత ఇనుము వ్యాపారం చేస్తూ..వేల కోట్లు సంపాదించాడు, ఇప్పుడు ఎన్నికల బరిలో

మరోవైపు ఒంటిపై ఉన్న గాయాలను చూసి ఏకే రావును వేరే ప్రాంతంలో హత్య చేసి రైల్వే ట్రాక్ పై పడేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. గడచిన వారం రోజుల నుంచి హరిణి తండ్రి నుంచి కుటుంబ సభ్యులకు కమ్యూనికేషన్‌ కట్టయ్యింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు ఏకే రావు.. రిటైర్ మెంట్ తర్వాత అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టారు. సుజనా ఫౌండేషన్‌ సీఈఓగా, సుజనా గ్రూప్స్‌ లీగల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు.. దీంతో ఆయన మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Read More : Nellore : ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి పోతా..ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడుతా : చంద్రబాబు

సెక్షన్‌ 302, 201 ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏకే రావు బెంగళూరుకు ఎప్పుడు వచ్చారు ? ఎందుకు వచ్చారు? అన్న అంశాలపై దృష్టి సారించారు. ఈ నెల 08వ తేదీన ఏకే రావు హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్లినట్టు గుర్తించారు పోలీసులు. చివరిసారిగా ఈ నెల 19న ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ నెల 23న ఏకే రావు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆ రోజునే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతి కేసు కాస్త హత్యకేసుగా టర్న్ తీసుకోవడంతో ఇప్పుడు కొత్త అనుమానాలు ప్రారంభమయ్యాయి. శ్రీనగర్‌ కాలనీలో నివాసముండే ఏకే రావు ఉన్నట్టుండి బెంగళూరు ఎందుకు వెళ్లారు? ఏ పని మీద వెళ్లారు? అసలు ఏకే రావుకు ఏం జరిగింది? ఆయన మృతికి గల కారణాలేంటి? ఇది ఎవరైనా కావాలని చేశారా? అన్నది సస్పెన్స్ గా మారింది.