Karnataka KGF : పాత ఇనుము వ్యాపారం చేస్తూ..వేల కోట్లు సంపాదించాడు, ఇప్పుడు ఎన్నికల బరిలో

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా...యూసుఫ్ షరీఫ్ అలియాస్ కేజీఎఫ్ బాబు మంగళవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వచ్చారు.

Karnataka KGF : పాత ఇనుము వ్యాపారం చేస్తూ..వేల కోట్లు సంపాదించాడు, ఇప్పుడు ఎన్నికల బరిలో

Kgf

Cong MLC Candidate : కొంతమంది వ్యాపారాలు కలిసి వస్తాయి. మరికొంతమందికి వ్యాపారాల్లో నష్టాల పాలై ఆర్థికంగా నష్టపోతుంటారు. అయితే.. ఓ వ్యక్తికి మాత్రం పాత సామాను చేసే వ్యాపారం కలిసివచ్చింది. ఏకంగా వేల కోట్లకు అధిపతి అయ్యాడు. ఈ విషయం ఎన్నికల అఫిడవిట్ ద్వారా వెల్లడైంది. ఈయన ఓ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిల్చొని…అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఘటన కర్నాటకలో చర్చనీయాంశమైంది. ఇతని గురించి తెలుసుకొనేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

Read More : Sonu Sood : శివశంకర్ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తా –  సోనూ సూద్

వివరాల్లోకి వెళితే…

కర్నాటక శాసనమండలికి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా…యూసుఫ్ షరీఫ్ అలియాస్ కేజీఎఫ్ బాబు మంగళవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా..తనకు ఎంత ఆస్తి ఉందో…డబ్బు..ఇతరత్రా విషయాలు ఆయన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. దాదాపు 1,643 కోట్ల స్థిరాస్తి, రూ. 97 కోట్ల చరాస్తి ఉందని వెల్లడించారు. ఇంత ఆస్తులు, అంత డబ్బులు రావడానికి తరతరాలుగా ఆయనకు సంక్రమించిన ఆస్తి కాదు. యూసుఫ్ షరీఫ్ చాలాకాలం పాత ఇనుము సామాగ్రీ వ్యాపారం చేశారు. కేజీఎఫ్ (KGF)లో పాత ట్యాంకులు కొనుక్కోవడం…వాటిని ఇతరులకు అమ్మడం వంటివి చేస్తున్నాడు. ఈ వ్యాపారం ఇతనికి బాగా కలిసి వచ్చింది. ఆయన్ను అందరూ ‘KGF బాబు’ గా పిలిచేవారు. అనంతరం తన మకాన్ని బెంగళూరుకు మార్చారు. వ్యాపారాన్ని మరింత విస్తరించి..స్థిరాస్తి రంగంలో దిగి..అక్కడ లాభాలను ఆర్జించారు. పెద్ద మొత్తంలో ఆస్తులను కొనుగోలు చేశారు.

Read More : Mysterious Stone: బంగారం కోసం వెతికితే బండరాయి దొరికింది.. అదేంటో తెలిసి షాక్..

ఎన్నికల పత్రాల్లో దాఖలు చేసిన ఆస్తుల వివరాలు

ఇతనికి ఇద్దరు భార్యలు..ఒక కుమార్తె ఉంది. మొదటి భార్య వద్ద రూ. 77.15 లక్షలు, రెండో భార్య వద్ద రూ. 30.37 లక్షలున్నాయి. కూతురి వద్ద రూ. 58.73 లక్షల విలువైన ఆభరణాలున్నాయని ప్రమాణపత్రంలో వెల్లడించారు. మొత్తం 23 బ్యాంకు ఖాతాలున్నాయని, రూ. 1.11 కోట్ల చేతి గడియారం…4.5 కిలోల బంగారం, 26 స్థలాలు వీటి విలువ రూ. 1593 కోట్లు, 4 సెల్ ఫోన్ (ఒక్కో విలువ రూ. లక్ష), రూ. 2.99 కోట్ల విలువైన 3 కార్లు, రూ. 48 కోట్ల విలువైన వ్యవసాయ భూములు, రూ. 3 కోట్ల విలువైన ఇల్లు ఆస్తుల్లో భాగంగా ఉన్నాయన్నారు. అంతేగాకుండా తనకు అప్పులు కూడా ఉన్నాయని వెల్లడించారు. రూ. 58 కోట్ల రుణాలున్నాయని తెలిపారు. మరి వేల కోట్లు సంపాదించిన ఈ వ్యాపారి..ఎన్నికల్లో గెలుస్తారా ? లేదా ? అనేది చూడాలి.