Cyber Crime : విత్తనాల వ్యాపారం పేరుతో రూ.34 లక్షల మోసం

పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ప్రజుల సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.

Cyber Crime : విత్తనాల వ్యాపారం పేరుతో రూ.34 లక్షల మోసం

Cyber Crime

Cyber Crime :  పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ప్రజలు  సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.

ఫేస్ బుక్ లో ఒక వ్యక్తికి.. యూకేకి చెందిన ఒక మహిళ పరిచయం అయ్యింది. ఆ పరిచయంలో భాగంగా ఇద్దరూ చాటింగ్ చేసుకోసాగారు. సీడ్స్ బిజినెస్ లో అత్యధిక లాభాలు వస్తాయని ఆ వ్యక్తిని నమ్మించింది యూకే మహిళ. యూకేలో సీడ్స్ ను అధిక ధరకు కొంటామని నమ్మించింది.

అందులో భాగంగా ఆ వ్యక్తి వద్దనుంచి రూ.34 లక్షలు కాజేసింది. మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమోసం చేసింది నైజీరియన్స్ ముఠాగా తేల్చారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరోక సంఘటనలో షేర్స్ ట్రేడింగ్ లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఒక వ్యక్తి వద్దనుంచి 3లక్షలు కాజేశారు  నిందితులు. హైదరాబాద్ ఎస్సార్ నగర్ కు చెందిన బాధితుడు ఫస్ట్ జాయిన్ వెబ్సైట్ అనే ట్రేడింగ్ కన్సల్టెంట్ సంస్ధలో రూ. 3 లక్షలు పెట్టుబడి పెట్టాడు.
Also Read :Rape Case : బందరు రేప్ కేసు నిందితులు అరెస్ట్
ట్రేడింగ్  చేయకుండా సదరు సంస్ధ దాటవేయటంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు  పోలీసులకు ఫిర్యాద చేసాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులుబెంగుళూరుకు చెందిన రాజ్ కుమార్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందుతుడు బెంగుళూరులో 12 మందితో కాల్ సెంటర్ నడుపుతూ ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.