KBR Park : కేబీఆర్ పార్క్‌‌లో మహిళ వాకింగ్ చేస్తుంటే..

ఆదివారం ఉదయం కేబీఆర్ పార్క్ కు వచ్చారు. అక్కడున్న వాక్ వేలో నడుచుకుంటూ ముందుకెళుతున్నారు. ఓ వ్యక్తి ఆ మహిళను ఫాలో అవుతున్నాడు...

KBR Park : కేబీఆర్ పార్క్‌‌లో మహిళ వాకింగ్ చేస్తుంటే..

Kbr Park

Updated On : March 13, 2022 / 1:41 PM IST

Woman Assaulted In KBR Park : కేబీఆర్ పార్క్.. ఈ పేరు తెలియని వారుండరు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖుల వరకు ఇక్కడకు వచ్చేసి వ్యాయామం, మార్నింగ్ వాకింగ్ చేస్తుంటారు. ఈ పార్క్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పార్క్ లో వాకింగ్ చేస్తున్న ఓ మహిళపై ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ సమయంలో ఆమె భర్త కూడా వాకింగ్ చేస్తున్నాడు. బాధితురాలితో పాటు ఆమె భర్త బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ నటి వాకింగ్ చేస్తుండగా ఆమె మీద దాడి జరగడం కలకలం రేపింది.

Read More : Young Man Suicide : సినిమా బాగాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

ఇక ఈ ఘటనకు సంబంధించిన విషయానికి వస్తే… భార్య భర్తలు 2022, మార్చి 13వ తేదీ ఆదివారం ఉదయం కేబీఆర్ పార్క్ కు వచ్చారు. అక్కడున్న వాక్ వేలో నడుచుకుంటూ ముందుకెళుతున్నారు. ఓ వ్యక్తి ఆ మహిళను ఫాలో అవుతున్నాడు. నిర్మానుష్య ప్రాంతానికి రాగానే.. అమాంతం ఆమెను పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి చీకట్లో పరారయ్యాడు. వెంటనే బాధితురాలు, ఆమె భర్త బంజారాహిల్స్ పీఎస్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు.

Read More : Boy Murdered : మూడు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు హత్య.. చెట్టుకు ఉరేసి చంపిన దుండగులు..!

గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతం చుట్టూ ఈ పార్క్ విస్తరించబడి ఉంది. ఈ పార్క్ కు ఉదయం, సాయంత్రం చాలా మంది వాకింగ్ చేయడానికి వస్తుంటారు. వీరిలో అనేక మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కూడా ఉంటారు. పార్క్ మొత్తం పచ్చదనం, ఆహ్లాదకరంగా ఉండడంతో ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ఫుల్ రష్ గా ఉంటుంది. కేబీఆర్ పార్క్ లో మూడు మార్గాలుంటాయి. ఒకటి పార్క్ లోపల, రెండోది బయటి ప్రాంతంలో, మూడోది మొత్తం బాహ్యంగా ఉంటుంది. ఈ పార్క్ సాయంత్రం 7 గంటలకు మూసివేస్తారు. పార్క్ చుట్టూ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. అయితే కొన్ని ప్రదేశాలు నిర్మానుష్యంగా ఉంటుండడంతో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో అక్కడ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో కార్యకలాపాలకు చెక్ పెట్టినట్లైంది. భద్రతను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.