Model Nayab Nadeem : గొంతు కోసి.. నగ్నంగా పడేసి..ప్రముఖ మోడల్ దారుణ హత్య

పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ మోడల్ నయాబ్ నదీమ్ అనుమానాస్పద స్ధితిలో మృతి చెందారు. దుండగులు ఆమెను అతి దారుణంగా గొంతుకోసి హత్యచేసి... నగ్న శరీరాన్ని ఇంట్లో పడేసి వెళ్లారు. 

Model Nayab Nadeem : గొంతు కోసి.. నగ్నంగా పడేసి..ప్రముఖ మోడల్ దారుణ హత్య

Pakistani Model Nayab Nadeem

Model Nayab Nadeem : పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ మోడల్ నయాబ్ నదీమ్ అనుమానాస్పద స్ధితిలో మృతి చెందారు. దుండగులు ఆమెను అతి దారుణంగా గొంతుకోసి హత్యచేసి… నగ్న శరీరాన్ని ఇంట్లో పడేసి వెళ్లారు.

పాకిస్తాన్ ప్రఖ్యాత మోడల్ నయాబ్ నదీమ్(29) ఆదివారం అనుమానాస్పద రీతిలో హత్య చేయబడింది. లాహోర్ లోని ఆమె ఇంట్లోనే ఈదారుణం చోటు చేసుకుంది. దుండగులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి దారుణంగా హత్యచేశారు. నయాబ్ సవతి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నయాబ్ లాహోర్ లోని డిఫెన్స్ ఏరియాలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఇంకా వివాహం కాలేదు.

ఆమె సవతి సోదరుడు నసీర్ ఇచ్చిన సమాచారం మేరకు … శనివారం అర్ధరాత్రి మేమిద్దరం  ఐస్‌క్రీం తినటానికి వెళ్లాం… ఆతర్వాత తనను ఆమె ఇంటి వద్ద దింపి, నేను ఇంటికి వచ్చిపడుకున్నాను.   నేను నిద్రపోయిన తర్వాత నాకు నయాబ్ కాల్ చేసింది. నిద్రలో ఉన్న నేను ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదు. ఉదయం నిద్రలేచి తిరిగి ఆమెకు కాల్ చేశాను. కానీ ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదు. దాంతో తనను చూడటానికి ఇంటికి వచ్చాను. అక్కడ నాకు భయానక దృశ్యం కనిపించిందని చెప్పుకొచ్చాడు.

గొంతు దగ్గర గాయంతో… రక్తపు మడుగులో.. నగ్నంగా పడి ఉన్న నయాబ్ శరీరం చూశానని… ఆ దృశ్యం చూసి షాక్ కు గురయ్యానని చెప్పాడు.  అనంతరం  తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశానని నసీర్ తెలిపాడు. నయాబ్ ఇంట్లో దొంగతనం జరిగిన లక్షణాలు కూడా లేవని… ఆమె ఇంటి బాత్రూం కిటీకి  పగిలిపోయి ఉందని దుండగులు దాని ద్వారా లోపలకు  వచ్చి హత్యచేసి ఉండవచ్చని భావిస్తున్నట్లు అతను వివరించాడు.దుండగులు ఆమెను హత్యచేసి మృతదేహాన్ని నగ్నంగా టీవీ రూం లోపడేసి వెళ్లినట్లు నసీర్ వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.