Constable Suicide: నాచారం పీఎస్ పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్య

రాజు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు మేరకు ప్రేమ వ్యవహారమే కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Constable Suicide: నాచారం పీఎస్ పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్య

Constable

Updated On : February 20, 2022 / 11:29 AM IST

Constable Suicide: హైదరాబాద్ నాచారం పీఎస్ పరిధిలో ఆదివారం దారుణ ఘటన వెలుగు చూసింది. తేజావత్ రాజు అనే కానిస్టేబుల్ తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నాచారం పోలీసుల వివరాలు మేరకు..తేజావత్ రాజు సైబరాబాద్ పోలీస్ కమిషనరెట్ పరిధిలోని మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. నాచారం పీఎస్‌ పరిధి సింగం చెరువు తండాలో రాజు నివసిస్తున్నాడు. ఈక్రమంలో శనివారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన రాజు, ఆదివారం ఉదయం గదిలో వేలాడుతూ కనిపించాడు.

Also read: Traffic Rules : జంట నగరాల్లో వాహనాలపై స్పీడ్ కంట్రోల్‌!

ఘటనపై కుటుంబ సభ్యులు నాచారం పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రాజు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు మేరకు ప్రేమ వ్యవహారమే కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read: Murder For Omelette : షాకింగ్.. ఆమ్లెట్ వేయలేదని భార్యను చంపిన భర్త