Agnipath: సికింద్రాబాద్ కాల్పుల ఘటన.. మృతుడు, క్షతగాత్రుల వివరాలు

ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో పదిహేను మంది వరకు గాయపడ్డట్లు సమాచారం. మృతుడు, క్షతగాత్రుల వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుడిని దామోదర రాకేష్ (18)గా గుర్తించారు.

Agnipath: సికింద్రాబాద్ కాల్పుల ఘటన.. మృతుడు, క్షతగాత్రుల వివరాలు

Agnipath

Updated On : June 17, 2022 / 3:36 PM IST

Agnipath: ‘అగ్నిపథ్’ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఆందోళన చేపట్టిన నిరసనకారులపై రైల్వే పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో పదిహేను మంది వరకు గాయపడ్డట్లు సమాచారం. మృతుడు, క్షతగాత్రుల వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుడిని దామోదర రాకేష్ (18)గా గుర్తించారు. దామోదర రాకేష్ వరంగల్ జిల్లా డబీర్‌పెల్ గ్రామానికి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Agnipath: ‘అగ్నిపథ్’పై యువతకు సరైన సమాచారం లేదనుకుంటున్నా: ఆర్మీ చీఫ్ జనరల్

క్షతగాత్రులను జగన్నాథ రంగస్వామి (20) మంత్రాలయం, కర్నూలు జిల్లా, రాకేష్ (20) చింతకుంట, కరీంనగర్ జిల్లా, జె.శ్రీకాంత్ (20) పాలకొండ గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా, ఎ.కుమార్ (21) వరంగల్ జిల్లా, పరశురాం (22) నిజాం సాగర్ కామారెడ్డి జిల్లా, పి.మోహన్ (20) నిజాం సాగర్, కామారెడ్డి జిల్లా, నాగేందర్ బాబు (21) ఖమ్మం జిల్లా, వక్కరి వినయ్ (20), విద్యాసాగర్ (అసిఫాబాద్), మహేశ్ (వికారాబాద్), లక్ష్మణ్ రెడ్డి (నల్గొండ), భరత్ (నిర్మల్)గా గుర్తించారు. వీరితోపాటు మోహన్ (20) నిజాం సాగర్, కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తికి బుల్లెట్ గాయమైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.